నాడు గంటసేపు ముద్దు పెడుతూ, నేడు డ్యాన్స్ చేస్తూ హీటెక్కిస్తున్న నితిన్ హీరోయిన్!
ఆదా శర్మ.. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో తన అందం, అభినయంతో టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. 2008లో 1920 అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ ఆ తర్వాత మూడేళ్లకు ఫిర్ అనే చిత్రం చేసింది. ఆ తర్వాత మరో రెండేళ్లకు హమ్ హై రాహి కార్ కి అనే సినిమాలో నటించి మెప్పించింది. ఇక 2014లో హార్ట్ ఎటాక్ అనే సినిమాతో నితిన్ పక్కన నటించి మెప్పించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నితిన్ ఈమెను గంట సేపు కిస్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. వీరిద్దరి లిప్ లాక్ సీన్ తో టాలీవుడ్ మొత్తం షాకై షేకైంది.
ఆ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం వంటి చిత్రాల్లోనూ నటించింది. 2015లో రాణా విక్రమ అనే సినిమా ద్వారా కన్నడు ఇండస్ట్రీలోనూ కాలు మోపింది. ఇటీవలే ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో నటించి ట్రెండింగ్ లో నిలిచింది. ఎన్నో గొడవల మధ్య విడుదలైన ఈ చిత్రం సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న ఈ క్యూట్ బ్యూటీ కొత్తగా నక్సలైట్ పాత్రలో కనిపించేందుకు సిద్ధం అవుతుంది.

ఎప్పుడూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలతో పాటు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించి అందరినీ ఆగం చేస్తోంది పద్ధతైన డ్రెస్సులోనే పరువాలు ఆరబోస్తూ.. కుర్రకారు గుండెల్ని హీటెక్కిస్తోంది.
రెండు జడలు వేసుకొని, బిగ్ చోకర్ పెట్టుకుంది. అలాగే పెద్ద ఇయర్ రింగ్స్ తో పాటు పాపిట బిళ్ల కూడా పెట్టుకొని చాలా అందంగా ముస్తాబైంది. అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్న లెహంగా వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆదా శర్మ చాలా అందంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లూజ్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలతో పాటు నడుము అందాలు కనిపించేలా ఫొటోలు దిగింది. వీటిని ఇన్ స్టా ద్వారా షేర్ చేస్తూ.. విల్ యు బీ మై డ్యాన్స్ పార్టనర్ అంటూ రాసుకొచ్చింది. అలాగే స్వైప్ టు సీ ఇఫ్ యు ఫిట్ క్రిటీరియా అంటూ ఓ కొండముచ్చు ఫొటోను షేర్ చేసింది.
ఆమె చేసిన ఈ పోస్టుకు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె స్నేహితులు తెగ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. నీవు పెట్టిన పోస్టుల్లో ఉన్న చివరి ఫొటోల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ చెప్పుకొస్తున్నారు. ఆ రెండు ఫొటోలు కొండముచ్చువి కావడం గమనార్హం. మరోవైపు ఆదా శర్మ వీటికి మరింత ఫన్నీగా రిప్లై ఇచ్చింది. నాక్కూడా ఆ రెండు ఫొటోలే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. మీరూ ఓ సారి ఆ అందమైన ఫొటోలతో పాటు అంతకు మించిన ఫన్నీ కామెంట్లను చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











