సిద్ధార్థ్‌ సీక్రెట్ మ్యారేజ్‌లో ట్విస్ట్... ఒక్క పోస్టుతో నోరు మూయించిన అదితి రావ్ హైదరీ

టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్ధ్, హీరోయిన్ అదితి రావ్ హైదరీ సీక్రెటుగా పెళ్లి చేసుకున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. వీరు తెలంగాణలోని వనపర్తి వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక వీరు అక్కడ షూటింగ్ అంటూ చెప్పి.. సీక్రెటుగా పెళ్లి చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ కథనాలన్నింటికి అతిధిరావు హైదరి చెక్ పెట్టేసింది. ఒకే ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అధితి రావ్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరు కూడా బయటచాలా సార్లు కనిపించారు. ఇక వీరి పెళ్లి చేసుకున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. మార్చి 27న తెలంగాణలోని వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగిందంటూ ప్రచారం జరిగింది.

Heroine Aditi Rao Hydari Shared Post About Engaged With Hero siddharth News Goes Viral

వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో సినిమా షూటింగ్ అని చెప్పి.. అక్కడి వారందరినీ బయటకు పంపించి వీరు వివాహం చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తమిళనాడు చెందిన పురోహితులు వీరిద్దరి వివాహన్ని హిందూ ఆచారాల ప్రకారం జరిపినట్లుగా టాక్ బయటకు వచ్చింది. అలాగే ఇద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు కానీ హిరామండి మూవీ ప్రమోషన్లలోనూ అదితి కనిపించకపోవడంతో.. అంతా పెళ్లి కోసమే వెళ్లిందని అనుకున్నారు.

హీరో సిద్ధార్థ్ కు ఇదివరకే పెళ్లైంది. కానీ ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలువలేదు. వారు విడిపోయారు. ఇక సమంతతో ప్రేమాయణం జరిపారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది కూడా ఎక్కువ కాలం నిలువలేదు. ఇక 2021లో విడుదలైన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితి కలిసి నటించారు. ఆ సమయంలో జరిగిన పరిచయమే ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్స్ కు వెళ్లారు.

Heroine Aditi Rao Hydari Shared Post About Engaged With Hero siddharth News Goes Viral

దీంతో వీరు ప్రేమలో ఉన్నారంటూ.. ప్రచారం మొదలైంది. ఇక వీరు క్లోజ్ గా మూవ్ అవుతూ ఫోటోలు పోస్ట్ చేయడం.. ఇదంతా వీరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక పలు ఈవెంట్స్ లోనూ సిద్ధార్థ్, అదితి కలిసి సందడి చేశారు. దీంతో అందరూ వీరు ప్రేమలో ఉన్నట్లు కన్మార్మ్ చేసుకున్నారు. అయితే సడెన్ గా నిన్నటి నుంచి వీరు పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిద్ధార్థ్ కు రెండో మ్యారేజ్ కాగా.. అతిథికి కూడా ఇది రెండో మ్యారేజే.

ఇక వీరు పెళ్లితో ఒక్కటయ్యారు అనుకుంటే.. తాజా అతిధి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సిద్ధార్థ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. దానికి అతను నాకు యస్ చెప్పాడు.. ఎంగేజ్డ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నిన్న జరిగింది పెళ్లి కాదు.. జస్ట్ నిశ్చితార్థం అని తెలుస్తోంది. దీంతో నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. పెళ్లి అనుకున్నాం.. నిశ్చితార్థం చేసుకున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్న అతిధి.. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అదితి డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సినిమాలో నటిస్తుంది. అలాగే సిద్ధార్థ్ ఇండియన్ 2లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X