Aditi Rao Hydari: "సిద్దార్థ్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నా.. కానీ అందరికీ చెప్పడానికి కారణం అదే!"

టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్ధ్, హీరోయిన్ అదితి రావ్ హైదరీలు ఇటీవలే సీక్రెటుగా నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకోగా. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో అందరూ వీరిద్దరూ సైలెంట్ గా పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం సాగింది. రెండ్రోజుల తర్వాత స్పందించిన హీరోహీరోయిన్లు ఇద్దరూ.. తమకు పెళ్లి కాలేదని కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగినట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇద్దరూ ఒకే రకమైన ఫొటోల పెట్టి అసలు విషయం చెప్పుకొచ్చారు. అయితే తాము సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోగా.. ఎందుకు అందరికీ చెప్పాల్సి వచ్చిందనే దానిపై తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరి క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తాను ఈ వార్తను అనౌన్స్ చేయడానికి గల ప్రధానమైన కారణాన్ని చెప్పుకొచ్చింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Heroine Aditi Rao Hydari Shocking Comments on Why She Announced Her Engagement News Check Details

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరిలు ప్రేమలో ఉన్నట్లు ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చాలా సార్లు బయట కూడా కనిపించారు. డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు వచ్చాయి. కానీ వీటిపై మాత్రం వీరు స్పందించలేదు. అితే సడెన్ గా 2024 మార్చి 27వ తేదీన తెలంగాణలోని వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగిందంటూ ప్రచారం జరిగింది.

వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో సినిమా షూటింగ్ అని చెప్పి.. అక్కడి వారందరినీ బయటకు పంపించి వీరు వివాహం చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తమిళనాడు చెందిన పురోహితులు వీరిద్దరి వివాహన్ని హిందూ ఆచారాల ప్రకారం జరిపినట్లు కూడా టాక్ నడిచింది. అలాగే ఇద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు కానీ హిరామండి మూవీ ప్రమోషన్లలోనూ అదితి కనిపించకపోవడంతో.. అంతా పెళ్లి కోసమే వెళ్లిందని అనుకున్నారు.

Heroine Aditi Rao Hydari Shocking Comments on Why She Announced Her Engagement News Check Details

కానీ ఆ తర్వాత రోజే అదితి తన నిశ్చితార్థంకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. అతడు ఓకే చెప్పాడంటూ హీరోయిన్, తను ఓకే చెప్పిందంటూ సిద్దార్థ్ లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఇలా అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఓ పెద్ద కారణమే ఉందని తాజాగా అదితి రావు హైదరి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ముఖ్యంగా తన అమ్మ కారణంగానే నిశ్చితార్థం ఫొటోలను నెట్టింట పెట్టాల్సి వచ్చిందని.. తమ పెళ్లి గురించి తెలుసుకోవాలని అనేక మంది తన తల్లికి ఫోన్ చేసినట్లు వివరించింది. రోజూ వచ్చే ఫోన్లకు ఆమె సమాధానం చెప్పలేక.. ప్లీజ్ ఇకనైనా మీ ఎంగేజ్ మెంట్ గురించి మీడియాకు చెప్పేయండి అని చెప్పినట్లు స్పష్టం చేసింది.

తన తల్లి చెప్పడం వల్లే తనతో పాటు సిద్దార్థ్ కూడా ఈ విషయాన్ని వెల్లడించాల్సి వచ్చిందని అదితి రావు హైదరి వివరించింది. తన లైఫ్ లో జరిగే ప్రత్యేకమైన వాటన్నిటినీ తన కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్న గుడిలో చేసుకోవాలనుకుని.. నిశ్చితార్థం అక్కడే చేసుకున్నట్లు కూడా వివరించిందీ ముద్దుగుమ్మ. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదీ క్యూట్ బ్యూటీ. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X