మొదటి భర్తపై బన్నీ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. నెటింట్లో స్పెషల్ వీడియో వైరల్

Amala Paul: సినీ సెలబ్రిటీలు సినిమాలలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ హల్చల్ చేస్తున్నారు. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ వర్క్ గురించి ఆసక్తికర విషయాలను తరచూ నెట్టింట్లో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు భామలు తమ గ్లామర్ షో తో నేటిజల్లును అట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో హల్ చల్ చేసే వారిలో సౌత్ ఇండియన్ బ్యూటీ అమలాపాల్ ఒకరు. ఈ అమ్మడు తరచూ తన పర్సనల్ లైన్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ కొన్ని సీక్రెట్స్ ను రిలీవ్ చేసింది. ఇంతకీ ఆ వీడియో ఏంటో ఓ లుక్కేయండి.

సౌత్ ఇండియన్ బ్యూటీ హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు 'ప్రేమఖైదీ' అనేది సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాలోనే తన అందం అభినయంతో అట్రాక్ట్ చేసి.. వరుస ఆఫర్లను అందుకుంది. ఆ తర్వాత హీరో సిద్ధార్థతో కలిసి 'లవ్ ఫెయిల్యూర్' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కి హిట్ టాక్ రావడం, అలాగే ఈ అమ్మడు యాక్టింగ్ కు మంచి మార్కులు రావడంతో రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది.

Heroine Amala pal shared her wedding video on the occasion of her first wedding anniversary

టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా అమలాపాల్ దగ్గరయింది. ఇలా వరుస హిట్లు కొడుతుండడంతో అటు తమిళ్, ఇటు తెలుగు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ సమయంలోకోలీవుడ్లో కూడా ధనుష్ విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించి తమిళ తంబీలను కూడా మెప్పించింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే.. కోలీవుడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది ఈ అమ్మడు.

మరోవైపు తన వివాహ బంధం కూడా మూడు నాలుగు ముచ్చటగా మారింది. కేవలం మూడు ఏళ్లలోనే విడాకులు తీసుకుని ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. విడాకుల అనంతరం సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ పాత్రల కంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ దూసుకు వెళ్తుంది.ఆ మధ్యకాలంలో ఓ మూవీలో న్యూడ్ గా నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. పలు వివాదాల బారిన పడింది.

ఇదిలా ఉంటే గతేడాది నవంబర్ 5న తన స్నేహితుడు, వ్యాపారవేత్త జగత్ దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకుంది. వీరి వివాహ వేడుక కేరళలోని కొచ్చిలో జరిగింది. ఇలా అమలా పాల్ తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. వీరి వివాహబంధం చాలా సాఫీగా సాగుతోంది. ఈ జంటకు ఈ ఏడాది జూన్‏లో కొడుకు పుట్టాడు. కొడుకు పేరు ఇళయ్. అమలా పాల్ తన రెండో పెళ్లి అయి.. నేటీతో ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేస్తూ.. తన జీవితంలో ఎదురైన అనుభవాలను, ఆనాటి మధుర జ్ఞాపకాల్ని పంచుకుంది.

Heroine Amala pal shared her wedding video on the occasion of her first wedding anniversary

అమలా పాల్ తన పెళ్లి వీడియోను షేర్ చేస్తూ.. ఇన్ డైరెక్ట్ గా తన మొదటి భర్త పై కామెంట్స్ చేసింది. తాను కలలను విశ్వసించే అమ్మాయిని, ఎదుగుతున్న క్రమంలో తన కలలన్నింటినీ తాను నేరవేర్చుకోవాలని భావించానన్నారు. కానీ.. ఈ క్రమంలో తన నమ్మకాన్ని తాను కోల్పోయాననీ, తన గత జీవితంలో తాను ఎన్నో తప్పులు జరిగాయన్నారు. అయినా వాటికి థ్యాంక్స్ చెబుతున్నా.. వాటి వల్లే తనకు ఈ కొత్త జీవితం లభించిందనీ, తనను అర్థం చేసుకునే వాడు తన జీవితంలోకి వచ్చాడని అమలాపాల్ చెప్పుకొచ్చింది. తన భర్త జగత్ దేశాయ్ తన జీవితమనీ, తనకు సంతోషాన్ని అందించిన ఆ దేవుడి తాను రుణపడి ఉంటానని ఎమోషనల్ అయ్యింది. అమలాపాల్.

ఇలా పరోక్షంగా అమలాపాల్ తన గత జీవితం, తన మొదటి భర్త డైరెక్టర్ ఏఎల్ విజయ్‌ కామెంట్స్ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ అమలాపాల్ తన కెరీర్ లో (2014) తమిళ ద‌ర్శ‌క‌నిర్మాత ఏఎల్ విజ‌య్‌ను వివాహమాడింది. కానీ, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావ‌డంతో 2017లో విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న అమలాపాల్.. గతేడాది నవంబర్ 5న జగత్ దేశాయ్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Read more about: amala pal al vijay kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X