అలియా భట్ బాటలోనే తెలుగు హీరోయిన్.. పెళ్లైన 2 నెలలకే బేబీ బంప్‌తో దర్శనం!

మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న ఈ భామ... న్యూ ఇయర్ కానుకగా తన అభిమానులకు శుభవార్త తెలియజేసింది. తాను తల్లికాబోతున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్స్ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నూతన సంవత్సరం ప్రారంభంలో మలయాళ భామ అమలా పాల్ తన జీవితంలో మాతృ ప్రేమను అందించడానికి, ఆ అనుభూతిని చెందడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకువచ్చింది. అమలా పాల్ తల్లి కాబోతున్న విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అమలా పాల్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టడంతో అభిమానులు విషెష్ చెబుతున్నారు. కామెంట్స్ రూపంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Heroine Amala Paul Pregnancy Announced Post Viral Full Details Here

ఇటీవల ఈ భామ.. రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌ నుంచే ఈ భామ తన ప్రియుడి జగత్ దేశాయ్‌ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కేరళలోని కోచ్చిలో నవంబర్ 5న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లికి పది రోజుల ముందు అమలా పాల్ తన పుట్టినరోజు నాడు అక్టోబర్ 26న జగత్ దేశాయ్ ప్రపోజ్ చేసి.. సర్ ప్రైజ్ ఇచ్చాడు. అమలా పాల్ అప్పుడు తన రెండో పెళ్లికి ఓకే చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయింది.

అయితే ఇక్కడే అభిమానులకు, నెటిజన్స్ కు క్రేజీ డౌట్స్ వస్తున్నాయి. నవంబర్ లో పెళ్లైంది... అప్పుడే ప్రెగ్నెన్సీ.. ప్రెగ్నెన్సీ అంటే ఓకే కానీ.. ఆమె బేబీ బంప్ తో దర్శనం ఇవ్వడంతో.. అందరూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బేబీ బంప్ రావాలంటే.. కాస్త టైం పడుతుంది. రెండు నెలలకే అంత రాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే... అమలా పాల్ పెళ్లికి ముందే గర్భవతి అయినట్లు నెటిజన్స్ తన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం వల్లే.. తాను త్వరగా పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. అక్టోబర్ 26న ప్రపోజల్.. పది రోజులు కూడా గడవక ముందే.. నవంబర్ 5న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం ఇదంతా ప్లానింగ్ అంటున్నారు. అందుకే తొందరపడి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అవి నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పెళ్లికి ముందే బాలీవుడ్ లో కూడా చాలా మంది హీరోయిన్లు ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత పెళ్లి పెళ్లి చేసుకుంది. ఇక ఆమె బాటలోనే అమలా పాల్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక అమలా పాల్ సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ లో రామ్ చరణ్, బన్నీ.. ఇలా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని సూపర్ హిట్లను అందుకుంది. ప్రస్తుతం ఈ భామ... ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీలో నటిస్తోంది. ఇందులో సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇదే కాకుండా ద్విజ అనే మరో మలయాళ చిత్రంలోనూ అమలా పాల్ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X