సెకండ్ మ్యారేజ్‌పై అమలాపాల్ కీలక నిర్ణయం.. బుద్దొచ్చిందిగా, ఇక ఎవరైనా ఓకె!

కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల్లో నటించిన అమలా పాల్ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తోంది. నటిగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో అమలాపాల్ వివాహం చేసుకుంది. ఆ తరువాత వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అమలాపాల్ బిజీ నటిగా కొనసాగుతోంది. కానీ ఆమె కథల ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెండవ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ వైపు

బాలీవుడ్ వైపు

అమలాపాల్ ప్రస్తుతం విభిన్నమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో నటించి చాలా కలమ అవుతున్నా తమిళ, మలయాళీ భాషల్లో మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల అమలాపాల్ తొలిసారి బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.

 రెండవ పెళ్లి నిర్ణయం వారిదే

రెండవ పెళ్లి నిర్ణయం వారిదే

రెండవ పెళ్లి గురించి అమలాపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పట్లో మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం లేదు. కానీ సెకండ్ మ్యారేజ్ విషయంలో నిర్ణయం మాత్రం మా అమ్మా నాన్నదే. ఒకసారి నా నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకున్నా. అది విజయవంతం కాలేదు. అమ్మా నాన్న నాకోసం మంచి నిర్ణయం తీసుకుంటారు. వారు ఎవరిని సెలెక్ట్ చేసినా నాకు ఓకె అని అమలాపాల్ చెప్పేసింది.

 పక్కాగా వస్తా

పక్కాగా వస్తా

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఆ వార్తకు కారణం నేనే. ఇటీవల జరిగిన ఓ సంఘటన విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశా. మహిళలపై ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కొనడానికి రాజకీయాల్లోకి వస్తారా అని కొందమంది అడిగారు. అప్పుడు చూద్దాం అంటూ సమాధానం ఇచ్చా. భవిష్యత్తులో తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని అమలాపాల్ తెలిపింది.

తెలుగులో అవకాశం కోల్పోయా

తెలుగులో అవకాశం కోల్పోయా

ఇటీవల తనకు తెలుగులో స్టార్ డైరెక్టర్ సినిమాలో అవకాశం వచ్చిందని అమలాపాల్ తెలిపింది. అందులో నా పొరపాటు కూడా కొంత ఉంది. సరిచేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలో తెలియదు. మళ్ళీ తనని సంపాదిస్తారనే ఆశ తనకు ఇంకా ఉందని అమలాపాల్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X