షర్ట్ మొత్తం విప్పేసి ‘ఎవడు’ హీరోయిన్ హాట్ షో: తల్లైన తర్వాత కూడా ఇంత ఘాటుగానా!

గతంలో మాదిరిగా ఇప్పుడు సినిమాల్లో నటిస్తేనే నటీనటులు హైలైట్ అవుతారన్న ఇదే లేదు. దీనికి కారణం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే. దీని పుణ్యమా అని హీరోలు, హీరోయిన్లు బిగ్ స్క్రీన్‌పై కనిపించకున్నా.. తరచూ ఏదో ఒక పోస్టు పెట్టి హాట్ టాపిక్ అవుతూనే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ఎంతో మంది నటీమణులు తమ అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో 'ఎవడు' హీరోయిన్ అమీ జాక్సన్ ఒకరు.

గతంలో వరుస పెట్టి సినిమాల్లో నటించిన ఈ భామ.. ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. అయితేనేం తరచూ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ విదేశీ చిన్నది ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

 అలా ఎంటర్.. తెలుగులోకి ఇలా పరిచయం

అలా ఎంటర్.. తెలుగులోకి ఇలా పరిచయం

పేరుకు పరదేశీ అమ్మాయే అయినా.. యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఇండియాలో అడుగు పెట్టింది హాట్ బ్యూటీ అమీ జాక్సన్. 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిందామె. ఇందులో బ్రిటీష్ యువరాణి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పిచింది. ఇలా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

గ్లామర్‌గానే కాదు... అలా కూడా మెప్పించి

గ్లామర్‌గానే కాదు... అలా కూడా మెప్పించి

పిల్లి కళ్ల చిన్నది అమీ జాక్సన్ విదేశీ అమ్మాయి కావడంతో ఆమె ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ బ్యూటీ ఆరంభంలోనే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న రోల్‌లో మెరిసింది. ఆ తర్వాత కూడా గ్లామరస్ పాత్రలతో పాటు నటిగా మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసింది. అందుకే ఆమె నటించింది కొన్ని చిత్రాల్లోనేనైనా ఎక్కువ పేరును సంపాదించుకుంది. పలు చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు... ఉత్తమ నటిగా పలు అవార్డులను సైతం అందుకుంది. ఆ తర్వాత అమీ జాక్సన్‌కు ఆఫర్లు వెల్లువెత్తినా కొన్నింటిలోనే నటించింది.

లవ్ ట్రాకుతో ఫేమస్... గర్భంతో నిశ్చితార్థం

లవ్ ట్రాకుతో ఫేమస్... గర్భంతో నిశ్చితార్థం

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. డేటింగ్ చేస్తున్న సమయంలోనే గర్భం దాల్చింది. దీంతో ఈ బ్యూటీ వ్యవహరం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. గర్భం దాల్చిన తర్వాత కొద్ది రోజులకు జార్జ్‌ పనాయొటోతో అమీ జాక్సన్ నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయినట్లు ప్రకటించింది. దీంతో ఈ అమ్మడు ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయిపోయిన విషయం తెలిసిందే.

తల్లైన అమీ జాక్సన్.. బ్రేకప్ చెప్పేసిందంటూ

తల్లైన అమీ జాక్సన్.. బ్రేకప్ చెప్పేసిందంటూ

ప్రియుడు జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్న సమయంలో ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్ గత ఏడాది ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారితో కలిసి తరచూ ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువ సమయంలో తనతోనే గడుపుతూ సినిమాకు సైతం దూరం అయింది. ఇక, ఎంగేజ్‌మెంట్ జరిగి చాలా కాలమే అవుతోన్న అమీ జాక్సన్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే జార్జ్‌ పనాయొటోకు ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసిందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటోంది

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటోంది

సోషల్ మీడియాలో అమీ జాక్సన్ ఎంత యాక్టివ్‌గా ఉంటోందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ విదేశీ నటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఆమె తన అందమైన ఫొటోలు, వీడియోల కూడా షేర్ చేస్తూ తెగ హల్‌చల్ చేసింది. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న బ్యూటీ కావడంతో అమీ జాక్సన్ పోస్టులకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె ఏం షేర్ చేసినా చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతుంటాయి.

ఎప్పుడూ అలాంటివే వదులుతోన్న చిన్నది

ఎప్పుడూ అలాంటివే వదులుతోన్న చిన్నది

అమీ జాక్సన్ సోషల్ మీడియాలో వదులుతోన్న వాటిలో ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలే ఉంటాయి. అంతెందుకు గర్భంతో ఉన్న సమయంలోనూ గ్లామర్ ఫొటోలను వదిలింది. ఇక, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే పంథాను ఫాలో అవుతోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను తన అందచందాలతో షేక్ చేసి పడేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు కొన్ని లక్షల్లో లైకులు రావడంతో పాటు అమీ జాక్సన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ గణణీయంగా పెరిగిపోతోంది. దీంతో ఈ బ్యూటీ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది.

Recommended Video

Prabhudeva Biography.. ఇన్స్పిరేషన్ మెగాస్టార్ !
షర్ట్ మొత్తం విప్పేసి రెచ్చిపోయిన ఫారెన్ నటి

షర్ట్ మొత్తం విప్పేసి రెచ్చిపోయిన ఫారెన్ నటి

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసే అమీ జాక్సన్.. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె షర్ట్ బటన్స్ మొత్తం తీసేసి కనిపించింది. ఫలితంగా బ్రా ధరించి ఉన్నప్పటికీ ఆమె ఎద అందాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక, ఇందులో ఆమె లుక్ కూడా కుర్రాళ్లను రెచ్చగొడుతున్నట్లుగా ఉంది. ఇంకేముంది ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. ఫలితంగా విదేశీ చిన్నది అమీ జాక్సన్ మరోసారి ఓ రేంజ్‌లో హైలైట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X