టాప్ విప్పేసి.. ప్యాంట్ తీసేసిన హీరోయిన్: కింద నుంచే మొత్తం కనిపించేలా!
భారతీయ సినీ రంగంలో ఫారెన్ అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా సందడి చేశారు. అయితే, అందులో అతి తక్కువ బ్యూటీలు మాత్రమే చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించగలిగారు. అలాంటి వారిలో అమీ జాక్సన్ ఒకరు.
అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. అతి తక్కువ సమయంలోనే ఓ రేంజ్‌లో పాపులర్ అయింది. దీంతో ఇండియాలోని చాలా భాషల్లో ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే, ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమీ ఓ హాట్ పిక్ వదిలింది. అది మీరే చూడండి!

అలా వచ్చి.. ఆ సినిమాలు: ఇంగ్లీష్‌లో సినిమాలు చేస్తోన్న సమయంలోనే అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలో అడుగు పెట్టింది. ఆ వెంటనే రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ మూవీల్లోనూ నటించి ఫుల్ పాపులర్ అయిపోయింది.

ప్రెగ్నెంట్ అవడంతో గ్యాప్: సౌత్ నుంచి నార్త్ వరకూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నప్పుడే అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో లవ్ ట్రాక్‌ను నడిపించింది. అలా అతడితో డేటింగ్‌లో ఉన్నప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాతనే జార్జ్‌తో అమీ ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అప్పటి నుంచి కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది.

తల్లైన బ్యూటీ.. బ్రేకప్‌తోనే: జార్జ్ పనాయెటోను పెళ్లి చేసుకోకుండానే అమీ జాక్సన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ అమ్మడు.. తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి సినిమాలు చేయడం లేదు. కానీ, తన కుమారుడు, ఫ్యామిలీతోనే ఎక్కువగా కాలం గడుపుతోంది.

మరో ఎఫైర్.. రీఎంట్రీ రెడీ: తల్లైన తర్వాత ప్రియుడితో విడిపోయిన అమీ జాక్సన్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీనికితోడు ఆమె ఊహించని విధంగా మరొక నటుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఇప్పటికే అతడికి సంబంధించిన ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇక, అమీ జాక్సన్ ప్రస్తుతం ఓ తమిళం చిత్రం ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

అందులో అస్సలు తగ్గట్లే: ఫారెన్ అమ్మాయే అయినా ఇండియాలోనూ సినిమాలు చేసిన అమీ జాక్సన్‌కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. సోషల్ మీడియానే దీనికి కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
అందాలు దాచుకోవట్లేదు: సినిమాల్లోకి రాకముందు నుంచే సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ ట్రెండింగ్ అవుతోన్న అమీ జాక్సన్.. అప్పటి నుంచి మరింత ఎక్కువగా గ్లామరస్ ఫొటోలను, వీడియోలను మాత్రమే షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాదు, గర్భంతో ఉన్న సమయంలోనూ, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. ఇక, ఇప్పుడు తల్లైనా తగ్గకుండా రెచ్చిపోతోంది.

అమీ ఘాటు ఫొటో వైరల్: ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ విప్పేసి, ప్యాంట్‌ను కిందకు జరిపి మరీ హాట్ షో చేసింది. ఇందులో చిన్న బ్రా మాత్రమే ధరించి కింద నుంచి ఫోటో దిగింది. దీంతో ఆమె ఎద అందాలు నుంచి నాభి భాగం వరకూ యమ హైలైట్ అవుతూ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్ యమ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











