ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొందరు మాత్రమే తక్కువ సినిమాలే చేసినా ఇంపాక్ట్‌ను చూపిస్తూ గుర్తుండిపోతారు. తద్వారా సినిమాలు చేసినా.. చేయకున్నా ప్రేక్షకులకు మాత్రం మజాను అందిస్తూనే ఉంటున్నారు. అలాంటి వారిలో బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు. పేరుకు విదేశీ అమ్మాయే అయినా.. ఇండియాకు వచ్చి మరీ సినిమాలు చేసింది. దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ మెప్పించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో దిగిన ఫొటోను వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!
Recommended Video

అలా మొదలైన అమీ ప్రయాణం
హాట్ బ్యూటీ అమీ జాక్సన్ యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఇండియాలో అడుగు పెట్టింది. 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో బ్రిటీష్ యువరాణి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పిచింది. ఇలా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిపోయింది.

గ్లామర్‌వే కాదు... అలాంటి రోల్స్
అమీ జాక్సన్ విదేశీ అమ్మాయి కావడంతో ఆమె ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ బ్యూటీ ఆరంభంలోనే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న రోల్‌లో మెరిసింది. ఆ తర్వాత కూడా గ్లామరస్ పాత్రలతో పాటు నటిగా మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసింది. అందుకే ఆమె నటించింది కొన్ని చిత్రాల్లోనేనైనా ఎక్కువ పేరును సంపాదించుకుంది. పలు చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు... ఉత్తమ నటిగా పలు అవార్డులను సైతం అందుకుంది. ఆ తర్వాత అమీ జాక్సన్‌కు ఆఫర్లు వెల్లువెత్తినా కొన్ని మాత్రమే చేసింది.

డేటింగ్.. గర్భంతోనే నిశ్చితార్థం
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. డేటింగ్ చేస్తున్న సమయంలోనే ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఈ బ్యూటీ వ్యవహరం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. గర్భం దాల్చిన తర్వాత కొద్ది రోజులకు జార్జ్ పనాయొటోతో అమీ జాక్సన్ నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయినట్లు ప్రకటించింది. దీంతో ఈ అమ్మడు పేరు మరోసారి మారుమ్రోగిపోయిన విషయం తెలిసిందే.

తల్లైన తర్వాత బ్రేకప్ చెప్పేసి
బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్న సమయంలోనే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. రెండేళ్ల క్రితమే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారితో కలిసి తరచూ ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువ సమయంలో తనతోనే గడుపుతూ సినిమాకు సైతం దూరం అయింది. ఇక, ఎంగేజ్‌మెంట్ జరిగి చాలా కాలమే అవుతోన్న అమీ జాక్సన్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే జార్జ్ పనాయొటోకు ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని ఆమె సన్నిహితులు వెల్లడించారు.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ విదేశీ నటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఆమె తన అందమైన ఫొటోలు, వీడియోల కూడా షేర్ చేస్తూ తెగ సందడి చేసింది. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న బ్యూటీ కావడంతో అమీ జాక్సన్ పోస్టులకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఆమె ఏం షేర్ చేసినా చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతుంటాయి.

ఎక్కువగా అలాంటివే వదిలేసి
సోషల్ మీడియాలో అమీ జాక్సన్ వదులుతోన్న వాటిలో ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలే ఉంటాయన్నది తెలిసిందే. సినిమాల్లో చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు, ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే పంథాను ఫాలో అవుతోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను తన అందచందాలతో ఓ ఊపు ఊపేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు కొన్ని లక్షల్లో లైకులు రావడంతో పాటు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక, అమీ జాక్సన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ గణణీయంగా పెరుగుతోంది.

ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రచ్చ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోన్న అమీ జాక్సన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ ఉల్లిపొర లాంటి డ్రెస్‌ను ధరించింది. ఫలితంగా ఈ అమ్మడు అందాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక, ఇందులో ఆమె లుక్ కూడా కుర్రాళ్లను రెచ్చగొడుతున్నట్లుగా ఉంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా అమీ షేర్ చేసిన ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. తద్వారా ఈ చిన్నది మరోసారి హైలైట్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











