ఇండస్ట్రీ వాళ్లు వాడుకొని వదిలేస్తారు.. అందుకే పెళ్లి చేసుకోను.. అనన్య నాగళ్ల

తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. అందం, అభినయంతో ఆకట్టుకొంటూ విభిన్నమైన పాత్రలతో ఆలరిస్తున్నారు. క్షుద్ర, మంత్ర విద్యలతో రూపొందిన తంత్ర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విరివిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా తెలుగు మీడియా ఛానెల్స్‌తో మాట్లాడుతూ తన పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇండస్ట్రీ వాళ్లను అసలే పెళ్లి చేసుకోను అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోనే నేను బీటెక్ పూర్తి చేసిన తర్వాత న్యాయశాస్త్రంలో డిగ్రీ సాధించాను. అలాంటి పరిస్థితుల్లో వకీల్ సాబ్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సెట్లో అందరూ లా గురించి నన్ను అడిగే వారు. అయితే నాకు డిగ్రీ మాత్రమే ముంది. చట్టాల గురించి పెద్దగా తెలియదని చెబితే.. నన్ను ఆటపట్టించే వారు అని అనన్య నాగళ్ల తెలిపింది.

Heroine Ananya Nagalla about Marriage with Telugu Industry People and Tantra Movie

నాకు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఉండేది. మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో తల్లిచాటును పెరిగాను. అయితే నా మొదటి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంటిలో ఎవరికి చెప్పలేదు. సినిమా విడుదల సమయంలో నేను నటించిన సినిమా రిలీజ్ అవుతున్నదని నా అన్నయ్యకు చెప్పాను. అలా నా సినిమా కెరీర్ ప్రారంభమైంది అని చెప్పింది.

నేను ప్రేమ వివాహం చేసుకొంటే ఇండస్ట్రీ వాళ్లను అసలే చేసుకోను. ఎందుకంటే.. పెళ్లి తర్వాత భార్యపై ఇండస్ట్రీ వాళ్లకు ఇష్టం తగ్గిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో రిలేషన్స్‌కు ఎక్కువగా స్కోప్ ఉంటుంది. కాబట్టి వివాహేతర సంబంధాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి పెళ్లి తర్వాత వాడుకొని వదిలేస్తారు. అందుకే నేను సినిమా పరిశ్రమకు చెందిన వారిని పెళ్లి చేసుకోను అని అనన్య నాగళ్ల తెలిపింది.

Heroine Ananya Nagalla about Marriage with Telugu Industry People and Tantra Movie

నాగార్జున-అమల, మహేష్ బాబు-నమ్రత, శ్రీకాంత్-ఊహ లాంటి వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకొన్నప్పటికీ.. వాళ్లు ఆలోచన, ప్రవర్తన, జీవితం పట్ల విజన్ వేరు. ఈ తరం వాళ్లకు తరహా కమిట్‌మెంట్ లైఫ్‌పై లేదు. అందుకే నాకు ఇండస్ట్రీ వాళ్లపై అంతగా నమ్మకం లేదు. ఇప్పటి తరం యువకుల్లో దాంపత్య జీవితం పట్ల అంతగా సీరియస్‌నెస్ లేదు. అందుకే ఇండస్ట్రీ వాళ్లను పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా అనన్య నాగళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై పీ నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్న చిత్రం తంత్ర. అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం మార్చి 15వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X