బాత్‌టబ్‌లో అందాలు ఆరబోసిన అనన్య నాగళ్ల: సర్‌ప్రైజ్ అంటూ మొత్తం చూపించిన తెలుగు పిల్ల

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతూ ఉంటారు. అయితే, అందులో లోకల్ వాళ్ల కంటే పక్క రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. నూటికి కోటికి ఒకరు అన్నట్లుగా టాలీవుడ్‌లో మన అమ్మాయిలు అడపాదడపా కనిపిస్తున్నారు. ఇలా.. ఈ మధ్య కాలంలో ప్రాంతీయ చిత్రాల్లో సందడి చేస్తోన్న తెలుగు అమ్మాయిల్లో అనన్య నాగళ్ల ఒకరు. ఆకట్టుకునే రూపు.. అద్భుతమైన టాలెంట్‌తో అదరగొడుతోన్న ఈ బ్యూటీ.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో వరుసగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో అనన్య సోషల్ మీడియా ద్వారా అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. ఆ పిక్ మీకోసం!

ఆరంభంలోనే అదుర్స్ అనిపించిన అనన్య

ఆరంభంలోనే అదుర్స్ అనిపించిన అనన్య

గొప్ప నటి అవ్వాలన్న లక్ష్యంతో చదువు పూర్తయిన వెంటనే ఫిల్మ్ స్కూల్‌లో చేరి శిక్షణ తీసుకుంది అనన్య నాగళ్ల. ఇందులో భాగంగానే నటిగానే కాకుండా పలు విభాగాల్లో ట్రైనింగ్ తీసుకున్న ఈ బ్యూటీ.. మోడల్‌గానూ మారింది. ఈ క్రమంలోనే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా యాక్ట్రెస్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. పేరుకు షార్ట్ ఫిల్మ్‌ అయినా ఇందులో అనన్య పాత్ర అదుర్స్ అనిపించింది. ఫలితంగా ఆమె చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తద్వారా ఉత్తమ నటిగా అవార్డులనూ అందుకుంది. ఫలితంగా ఆరంభంలోనే సెన్సేషన్ అయింది.

ఆ చిత్రంతో హీరోయిన్‌గా... ప్రశంసల వర్షం

ఆ చిత్రంతో హీరోయిన్‌గా... ప్రశంసల వర్షం


'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ఆరంభించిన అనన్య నాగళ్ల.. ఆ తర్వాత టాలీవుడ్‌లోని దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, చాలా చిత్రాలను ఆమె రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'మల్లేశం' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తీసిన ఈ చిత్రంతో అనన్య నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. డీ గ్లామర్ రోల్‌ అయినప్పటికీ అందులో ఆమె చేసిన యాక్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

పవన్ కల్యాణ్‌తో మూవీ... మారిపోయింది

పవన్ కల్యాణ్‌తో మూవీ... మారిపోయింది

'మల్లేశం' సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన గొప్ప చిత్రాల జాబితాలో చేరింది. అలాగే, అందులో హీరోయిన్‌గా నటించిన అనన్యకూ విశేషమైన గుర్తింపు దక్కింది. దీంతో ఈ తెలుగమ్మాయికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లో అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రలో నటించి తన సత్తాను నిరూపించుకుంది. ఇందులో ఇనోసెంట్ గర్ల్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. తన మార్క్ యాక్టింగ్‌ను చూపించింది. ఇక, ఈ చిత్రం తర్వాత అనన్య కెరీర్‌కు మంచి ఊపొచ్చింది.

ఆ సినిమాతో మరో హిట్.. అప్పటి పాత్రలో

ఆ సినిమాతో మరో హిట్.. అప్పటి పాత్రలో

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌తో కలిసి చేసిన 'వకీల్ సాబ్' తర్వాత అనన్య నాగళ్లకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 'ప్లే బ్యాక్' అనే టైం కనెక్షన్ కాన్సెప్టుతో వచ్చిన చిత్రంలో నటించింది. ఇందులో 90వ దశకం నాటి అమ్మాయిగా ఆమె చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. తల్లిగా ఆమె చూపించిన హావభావాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దినేష్ రాజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని హరి ప్రసాద్ తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆహాలో నేరుగా రిలీజ్ అయింది. ఇది సూపర్ హిట్‌గా నిలిచింది. దీన్ని ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో చేర్చారు.

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న నటి

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న నటి

తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఇప్పటి వరకూ చేసిన సినిమాలు కేవలం మూడు మాత్రమే. అయినప్పటికీ ఆమెకు ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కింది. దీనికి తోడు ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఫలితంగా ఆమెకు లక్కీ హీరోయిన్ ట్యాగ్ వచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె రెండు సినిమాలు ఓకే చేసిందట. అందులో వేరే భాషకు సంబంధించిన ఓ సినిమా కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. కానీ, అది ఏ ఇండస్ట్రీకి సంబంధించినది అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటూ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటూ

చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ లోకల్ బ్యూటీ అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చిత్రాలను పట్టాలెక్కించేస్తున్న ఈ బ్యూటీ.. తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ కొంత కాలంగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తద్వారా ఆమెను అభిమానించే వాళ్లు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నారు.

Recommended Video

Megastar Chiranjeevi Birthday Wishes To Kaikala Satyanarayana ​| Filmibeat Telug
బాత్‌టబ్‌లో అందాలు మొత్తం చూపించింది

బాత్‌టబ్‌లో అందాలు మొత్తం చూపించింది

తెలుగు టాలెంటెడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ షోతో రెచ్చిపోతోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్‌ను వదిలింది. ఇందులో ఆమె బాత్‌టబ్‌లో పడుకుని తడిచిన బట్టల్లో కనిపించింది. ఈ పిక్‌లో ఆమె లేలేత అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ఎద అందాలతో పాటు తొడలను కూడా చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X