మరోసారి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: లేలేత అందాలను చూపిస్తూ.. గతంలో కనిపించనంత ఘాటుగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును అందుకుంటారు. తద్వారా వరుస అవకాశాలతో దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. టాలీవుడ్‌పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తోందామె. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య హాట్ ఫొటోతో రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం.. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అందులో అదరగొట్టిన లోకల్ బ్యూటీ

అందులో అదరగొట్టిన లోకల్ బ్యూటీ

యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే ఫిల్మ్ స్కూల్‌లో చేరి పలు విభాగాల్లో శిక్షణ తీసుకుంది అనన్య నాగళ్ల. ఈ క్రమంలోనే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో ఆమె చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తద్వారా ఉత్తమ నటిగా అవార్డులనూ అందుకుంది. ఫలితంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.

షార్ట్ ఫిల్మ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ

షార్ట్ ఫిల్మ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ

షార్ట్ ఫిల్మ్ ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ఆరంభించిన అనన్య నాగళ్ల.. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'మల్లేశం' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తీసిన ఈ చిత్రంతో అనన్య నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. డీ గ్లామర్ రోల్‌ అయినప్పటికీ అందులో నటించి అందరి మన్ననలూ అందుకుంది.

‘వకీల్ సాబ్’ మూవీతో మారిపోయింది

‘వకీల్ సాబ్’ మూవీతో మారిపోయింది


'మల్లేశం' సినిమాకు తెలుగులో ఎంతో పేరు వచ్చింది. అలాగే, అందులో హీరోయిన్‌గా నటించిన అనన్యకూ గుర్తింపు దక్కింది. దీంతో ఈ తెలుగమ్మాయికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లో అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రలో నటించి తన సత్తాను నిరూపించుకుంది.

టైం కనెక్షన్ సినిమా.. సత్తా చాటేసింది

టైం కనెక్షన్ సినిమా.. సత్తా చాటేసింది

'వకీల్ సాబ్' తర్వాత అనన్య నాగళ్లకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 'ప్లే బ్యాక్' అనే టైం కనెక్షన్ కాన్సెప్టుతో వచ్చిన చిత్రంలో నటించింది.ఇందులో 90వ దశకం నాటి అమ్మాయిగా ఆమె చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. దినేష్ రాజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని హరి ప్రసాద్ తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆహాలో నేరుగా రిలీజ్ అయింది. ఇది సూపర్ హిట్‌గా నిలిచింది.

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది

అనన్య నాగళ్ల ఇప్పటి వరకూ చేసిన సినిమాలు కేవలం మూడు మాత్రమే. అయినప్పటికీ ఆమెకు ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కింది. దీనికి తోడు ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఫలితంగా ఆమెకు లక్కీ హీరోయిన్ ట్యాగ్ వచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె రెండు సినిమాలు ఓకే చేసిందట.

అందులో ఎప్పుడూ బిజీగా ఉంటోంది

అందులో ఎప్పుడూ బిజీగా ఉంటోంది

అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నప్పటికీ.. తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ కొంత కాలంగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Recommended Video

Web Series లకి విశేష ఆదరణ.. మొన్న Surya.. ఇప్పుడు 30 Weds 21 || Filmibeat Telugu
లేలేత అందాలను చూపించిన అనన్య

లేలేత అందాలను చూపించిన అనన్య


టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ షోతో రెచ్చిపోతోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్‌ను వదిలింది. ఇందులో ఆమె నాభి అందాలతో పాటు ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X