Ananya Nagalla Hot Photos: సినిమాల్లో అలా.. రియల్‌గా ఇలా.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన బ్యూటీ

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది హీరోయిన్ అనన్య నాగళ్ల. అసాధారణమైన నటనతో లోకల్ అమ్మాయిలు కూడా టాలీవుడ్‌లో సత్తా చాటగలరు అని నిరూపించిన ఈ అమ్మడు.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించగా.. అన్నింట్లోనూ చక్కని నటనతో ఆకట్టుకుంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే అనన్య.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి!

 అలా మొదలైన అనన్య ప్రయాణం

అలా మొదలైన అనన్య ప్రయాణం

తెలంగాణకు చెందిన అనన్య నాగళ్ల యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో పలు విభాగాల్లో ట్రైనింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఈ ఫిల్మ్‌లో ఆమె చేసిన నటన అదుర్స్ అనిపించింది. ఫలితంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తద్వారా ఉత్తమ నటిగా అవార్డులనూ అందుకుంది. దీంతో గ్రాండ్ ఎంట్రీని అందుకుందామె.

 ఫస్ట్ మూవీలోనే అదరగొట్టేసిందిగా

ఫస్ట్ మూవీలోనే అదరగొట్టేసిందిగా

కేవలం ఒక్క షార్ట్ ఫిల్మ్‌తో అనన్య సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'మల్లేశం' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తీసిన ఈ చిత్రంతో అనన్య నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది.

 పవన్ సినిమాలోనే ఛాన్స్ పట్టేసి

పవన్ సినిమాలోనే ఛాన్స్ పట్టేసి

'మల్లేశం' మూవీ తర్వాత అనన్య నాగళ్ల పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లో అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రలో నటించింది. ఇనోసెంట్ యాక్టింగ్‌తో ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేసిందీ అమ్మాయి.

 ఓటీటీ సినిమాలో అదుర్స్ అనేలా

ఓటీటీ సినిమాలో అదుర్స్ అనేలా

అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన చిత్రం 'ప్లే బ్యాక్'. టైం కనెక్షన్ కాన్సెప్టుతో తెలుగులోనే మొదటి సారి అలాంటి కథతో రూపొందిందీ మూవీ. ఇందులో 1993 కాలం నాటి అమ్మాయిగా ఆమె చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. దినేష్ రాజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని హరి ప్రసాద్ తెరకెక్కించాడు. ఆహాలో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. ఇది సూపర్ హిట్‌గా నిలిచింది.

ఫుల్ బిజీగా అనన్య.. క్రేజీ రోల్స్‌తో

ఫుల్ బిజీగా అనన్య.. క్రేజీ రోల్స్‌తో

అనన్య నాగళ్ల తెలుగు సినీ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌లా మారింది. అందుకే ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించిన ఆమె.. మరో రెండు చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే సమయంలో అనన్య మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

 అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

సినిమాల మీద సినిమాలతో దూసుకుపోతోన్న అనన్య నాగళ్ల.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ కొంత కాలంగా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయిపోతోంది.

Recommended Video

Web Series లకి విశేష ఆదరణ.. మొన్న Surya.. ఇప్పుడు 30 Weds 21 || Filmibeat Telugu
హాట్ ఫొటోలతో షాకిచ్చిన అనన్య

హాట్ ఫొటోలతో షాకిచ్చిన అనన్య

సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది అనన్య నాగళ్ల. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలతో షాకిచ్చింది. ఈ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్లీవేజ్ షో చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో వీటికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X