For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ షోతో షాకిచ్చిన అనన్య నాగళ్ల: అందాలన్నీ కనిపించేలా తెలుగమ్మాయి ఘాటు ఫోజులు

  |

  తొలినాళ్లతో పోలిస్తే కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకవు అన్న టాక్ ఉండేది. దర్శక నిర్మాతలు, హీరోలు ఎక్కువగా ఉత్తరాది బ్యూటీ వైపు చూస్తుండడంతో చాలా మంది తెలుగు భామలు అవకాశాలు దొరకక ఇబ్బందులు పడ్డారు. అయితే, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది మన అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అందంతో పాటు అభినయంతో రాణిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ల ఒకరు. ఆమె చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  అలా పరిచయం.. అదుర్స్ అనిపించింది

  అలా పరిచయం.. అదుర్స్ అనిపించింది

  యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల చదువు పూర్తయిన వెంటనే ఫిల్మ్ స్కూల్‌లో చేరి శిక్షణ తీసుకుంది. ఇందులో భాగంగానే నటిగానే కాకుండా పలు విభాగాల్లో ట్రైనింగ్ తీసుకున్న ఈ బ్యూటీ.. మోడల్‌గానూ మారింది. ఈ క్రమంలోనే ‘షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా యాక్ట్రెస్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. పేరుకు షార్ట్ ఫిల్మ్‌ అయినా ఇందులో అనన్య పాత్ర అదుర్స్ అనిపించింది. ఫలితంగా ఆమె చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తద్వారా ఉత్తమ నటిగా అవార్డులనూ అందుకుంది. ఫలితంగా ఆరంభంలోనే అదుర్స్ అనిపించింది.

  కొత్తలో నరకం అనుభవించా.. దానివల్ల పిల్లలు కూడా పుట్టరని భయపడ్డా: రోజా సంచలన వ్యాఖ్యలు

  హీరోయిన్‌గా ఎంటర్.. అదరగొట్టేసిందిగా

  హీరోయిన్‌గా ఎంటర్.. అదరగొట్టేసిందిగా

  షార్ట్ ఫిల్మ్‌ ‘షాదీ' ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించిన అనన్య నాగళ్ల.. ఆ తర్వాత టాలీవుడ్‌లోని దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, చాలా చిత్రాలను ఆమె రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మల్లేశం' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తీసిన ఈ చిత్రంతో అనన్య నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. డీ గ్లామర్ రోల్‌ అయినప్పటికీ అందులో ఆమె చేసిన యాక్టింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

  ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ పట్టేసి

  ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ పట్టేసి

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన గొప్ప చిత్రాల జాబితాలో ‘మల్లేశం' సినిమా చేరింది. అలాగే, అందులో హీరోయిన్‌గా నటించిన అనన్య నాగళ్లకూ భారీ స్థాయిలో గుర్తింపు దక్కింది. దీంతో ఈ తెలుగమ్మాయికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్'లో అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రలో నటించి తన సత్తాను నిరూపించుకుంది. ఇందులో ఇనోసెంట్ గర్ల్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. తన మార్క్ యాక్టింగ్‌ను చూపించింది. ఈ మూవీతో అనన్యకు బిగ్ బ్రేక్ దక్కినట్లైంది.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  అనన్య ఖాతాలో మరో హిట్.. ఆ పాత్రలో

  అనన్య ఖాతాలో మరో హిట్.. ఆ పాత్రలో

  పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్ సాబ్' తర్వాత అనన్య నాగళ్లకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ‘ప్లే బ్యాక్' అనే టైం కనెక్షన్ కాన్సెప్టుతో వచ్చిన చిత్రంలో నటించింది. ఇందులో 90వ దశకం నాటి అమ్మాయిగా ఆమె చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. తల్లిగా ఆమె చూపించిన హావభావాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దినేష్ రాజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని హరి ప్రసాద్ తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆహాలో నేరుగా రిలీజ్ అయింది. ఇది సూపర్ హిట్‌గా నిలిచింది. దీన్ని ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో చేర్చడంతో ఆమె ఖాతాలో మరో హిట్ వచ్చింది.

  టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న నటి

  టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న నటి

  లోకల్ బ్యూటీ అనన్య నాగళ్ల ఇప్పటి వరకూ చేసిన సినిమాలు కేవలం మూడు మాత్రమే. అయినప్పటికీ ఆమెకు ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కింది. దీనికి తోడు ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఫలితంగా ఆమెకు లక్కీ హీరోయిన్ ట్యాగ్ వచ్చేసింది. దీంతో ఈ బ్యూటీ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె రెండు సినిమాలు ఓకే చేసిందట. అందులో వేరే భాషకు సంబంధించిన ఓ సినిమా కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. కానీ, అది ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు కానీ అమ్మడు దూసుకెళ్తోంది.

  నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా రచ్చ: డార్క్ రూమ్‌లో ఒకరిపై ఒకరు.. పర్సనల్ ఫొటో వైరల్!

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ లోకల్ బ్యూటీ అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చిత్రాలను పట్టాలెక్కించేస్తున్న ఈ బ్యూటీ.. తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ కొంత కాలంగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తద్వారా ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీగా పెరుగుతోంది.

  చీరకొంగును పక్కకు జరిపి అందాల విందు

  చీరకొంగును పక్కకు జరిపి అందాల విందు

  తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ షోతో రెచ్చిపోతోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్‌లను వదిలింది. ఇందులో ఆమె చీర కట్టుకుని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. ఇందులో కొంగును పక్కకు జరపడంతో ఆమె లేలేత అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో ఇవన్నీ వైరల్ అయిపోయాయి.

  English summary
  Telugu Actress, Vakeel Saab Movie Fame Ananya Nagalla Very Active in Social Media. Now She Shared Hot Saree Photo in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X