వేణుస్వామితో అనన్య నాగళ్ల.. ఆయనను అందుకోసమే కలిసిందా?

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాను ఎక్కువగా వాడే వారికి ఈయన గురించి మరింత ఎక్కువ తెలుసు. ముఖ్యంగా సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకలుకు సంబంధించిన జాతకాలు చెబుతూ సెన్సేషనల్ కామెంట్లు చేస్తారు. అలాగే వామాచారంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కెరియర్ బాగుండేందుకు అనేక మంది హీరోహీరోయిన్లకు ఈయన పూజలు జరిపించారు. అయితే తాజాగా ఈయన టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనన్య నాగళ్లతో కలిసి ఫొటోలు దిగారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలోని హైదరాబాద్ లో ఉండే వేణు స్వామి.. ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీకి చెందిన ప్రముఖుల జాతకాల గురించి చెబుతుంటారు. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి షాకింగ్ కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇందులో కొన్ని జరగగా... మరికొన్ని మాత్రం జరగలేవు. దీంతో పాజిటివ్ కామెంట్లతో పాటు నెగిటివ్ కామెంట్లు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈయనను మెచ్చుకునే వారితో పాటు తిట్టేవారు కూడా ఎక్కువగా ఉంటారు. అయినా ఈయన అవేమీ పట్టించుకోకుండా.. తరచుగా జాతకాలు చెబుతూనే ఉంటారు.

Heroine Ananya Nagalla Venu Swamy in Single Frame Photos Viral

అలాగే చాలా మంది హీరో హీరోయిన్లు వేణు స్వామితో పూజలు చేయించుకుంటారు. అందరూ సాధారణంగా నిష్టతో పూజలు చేస్తే ఈయన మాత్రం మద్యం, మాంసం సేవిస్తూ... రచ్చ చేస్తూ మరీ పూజలు చేస్తారు. దీన్నే వామాచారం అంటూ.. ఇలా చేయడం వల్ల ప్రతిఫలం త్వరగా వస్తుందని కూడా అంటుంటారు. అయితే ఇప్పటికీ ఈయనతో చాలా మంది హీరోయిన్లు పూజలు చేయించుకున్నారు. డింపుల్ హయాతి, నిధి అగర్వాల్, రష్మిక మందన్న, బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా, అషురెడ్డి వీళ్లంతా ఈయన క్లైంట్ లే.

అయితే తాజాగా మరో క్యూట్ బ్యూటీ కూడా ఈయనను కలిసింది. అయితే టాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల.. తాజాగా ఈయనను కలిసింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అనన్య నాగళ్ల ఈయనను కలిసిందంటే పూజే చేయించుకునే ఛాన్స్ ఉందని.. పూజ చేయించుకునే వాళ్లు మాత్రమే ఈయనను కలుస్తారంటూ నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. తొలి సినిమాతోనే హిట్ట కొట్టిన ఈమె.. తాజాగా తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Heroine Ananya Nagalla Venu Swamy in Single Frame Photos Viral

అయితే ఆమె కెరియర్ లో త్వరగా ఎదగాలనే ఉద్దేశంతోనే వేణు స్వామితో పూజలు చేయించుకుంటుందని టాక్ నడుస్తోంది. ఆమె ఏదైనా పని మీద వెళ్లి ఆయనను కలిసిందా.. లేక నిజంగానే పూజ చేయించుకోవడానికి వెళ్లిందా అనేది మాత్రం కన్ఫార్మ్ గా తెలియదు. కానీ పూజ కోసమే వెళ్లిందని గట్టిగా వినిపిస్తుంది. చూడాలి మరి ఆ ఫొటోలు కూడా బయటకు వస్తాయేమో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X