Ananya Nagalla ఇంటెన్స్ లుక్‌తో అనన్య నాగళ్ల.. మంత్ర, తంత్రాలు, క్షుద్ర శక్తులతో బ్యూటీ పోరాటం!
తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న యువ హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం మూవీతో విశేషంగా గుర్తింపు తెచ్చుకొన్న ఈ అందాల బొమ్మ.. వకీల్ సాబ్, మళ్లీ పెళ్లిలో తనదైన శైలిలో తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు.
తాజాగా మరో డిఫరెంట్ రోల్‌తో అనన్య నాగళ్ల మరోసారి అభిమానులను, ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కోవలోనే ఆమె తంత్ర అనే హారర్, థ్రిల్లర్ మూవీతో రాబోతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఆమె లుక్ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లుక్, సినిమా వివరాల్లోకి వెళితే. .

మంత్ర, తంత్రాలు, క్షుద్ర శక్తుల కథా నేపథ్యంతో హారర్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న తంత్ర సినిమాకు సంబంధించిన అనన్య లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా ట్రెండింగ్‌గా నిలిచింది. తాజా పోస్టర్‌లో అనన్య లుక్ వైరల్ అవుతున్నది. ఇంటెన్స్ లుక్‌తో అనన్య నాగళ్ల సరికొత్తగా కనిపించింది.
తంత్ర పోస్టర్ వివరాల్లోకి వెళితే.. అనన్య నాగళ్లను కొన్ని శక్తులు బంధించినట్టు, ముఖం చుట్టూ రక్తం, పసుపుతో ఉన్న చేతులు పెట్టి ఆమెను పీడిస్తున్నట్టు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ చూస్తే అందరికీ కొత్త అనుభూతిని ఇచ్చే కంటెంట్‌తో మూవీ వస్తుందనే విషయం స్పష్టమవుతున్నది.
ఇదిలా ఉండగా, తంత్ర సినిమా ద్వారా స్వర్గీయ శ్రీహరి తమ్ముడు కుమారుడు ధనుష్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అలాగే హీరోయిన్ సలోని ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు చేరువ కానున్నారు.
నటీనటులు: అనన్య నాగళ్ల, ధనుష్, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు
బ్యానర్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వీ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాతలు: నరేష్ బాబు, రవి చైతన్య
దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి
కెమెరా: సాయి రామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల
ఎడిటింగ్: ఎస్‌బీ ఉద్దవ్
సంగీతం: RR ధృవన్
సౌండ్ డిజైనర్: జ్యోతి చేతియా
పీఆర్వో: మధు వీఆర్.


Click it and Unblock the Notifications











