Ananya Nagalla: వేణు స్వామితో హీరోయిన్స్ పూజలు.. అసలు విషయం బయటపెట్టిన పోట్టేల్ బ్యూటీ..

Ananya Nagalla: శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా.. రోజురోజుకు సైన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నా.. శాస్త్రవేత్తల పరిశోధనలతో ఎన్నో విషయాలు బయటకు వెలుగులోకి తెస్తున్నా.. జ్యోతిష్యాన్ని నమ్మేవారు లేకపోలేదు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. ఇటీవల చాలా సినీ సెలబ్రిటీలు.. మెయిన్ గా హీరోయిన్స్ ఎక్కువగా వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకుంటారనే ఇండస్ట్రీ టాక్. అయితే ఈ విషయంపై పొట్టేల్ హీరోయిన్ అనన్య నాగళ్ళ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి తెలియని ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు గురించి చెబుతూ తెగ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి ఇండస్ట్రీలో
సంచలనం స‌ృష్టించారు. వీరితో పాటు పలువురు హీరోయిన్ జాతకం చెప్పి సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. ఆయన చెప్పే జాతకాలు ఫెయిల్ అయినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

Heroine Ananya Nagella made interesting comments on astrologer Venu Swamy

హీరోయిన్స్ డింపుల్ హయాతి, నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక, నిధి ఆగర్వాల్,బిగ్‌బాస్‌ బ్యూటీ ఇనయ సుల్తానా, నిశ్విక వంటి తదితర హీరోయిన్లతో ప్రత్యేక పూజలు చేసి వారి జాతక దోష నివారణ చేయించుకున్నారని టాక్. అయితే.. తాజాగా శోభిత నాగచైతన్యల ఎంగెజ్మెంట్ తరువాత వారు పెళ్లి చేసుకున్న తరువాత వీడిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తెలంగాణ కోర్టు కూడా ఆయన పై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. వకీల్ సాబ్ బ్యూటి అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీ పొట్టేల్. ఈ మూవీ అక్టోబర్ 25న విడుదలైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అనన్య నాగళ్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ తో పాటు అద్రుష్టం కూడా ఉండాలని, ఆ రెండు కలసి ఉంటేనే సక్సెస్ అవుతామని తెలిపారు. మరీ ఎప్పుడైనా జాతకాలు చూపించుకున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. తనకు అలాంటి అవకాశం, అలాంటి ఆలోచనలు అని రాలేదనీ, ఆయన చిన్నప్పటినుండి జాతకాలను పట్టించుకోనని అన్నారు.

Heroine Ananya Nagella made interesting comments on astrologer Venu Swamy

ఎవరైనా తన జాతకం గురించి చెప్పిన తాను అంతగా పట్టించుకోనని అన్నారు. జాతకాలను పట్టించుకుంటే.. పాజిటివ్ గానూ నెగటివ్ గాను మన జీవితం మీద ప్రభావం చూపుతుందన్నారు అనన్య నాగళ్ల. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ పేను స్వామి దగ్గర జాతకాలు చూపించుకుంటూ పూజలు చేయించుకుంటున్నారు కదా మరి మీరు ఎప్పుడైనా వెళ్లారు కాదా ? అని యాంకర్ ప్రశ్నించగా.. తంత్రి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాను నేను స్వామి దగ్గరికి వెళ్ళానని, కానీ తన జాతకాన్ని చూపించుకోలేదన్నారు. కేవలం మూవీ ప్రమోషన్ కోసం మాత్రమే తాను వెళ్లానని, ఆయన కూడా తనని పూజల కోసం పిలవలేదని చెప్పుకొచ్చారు.

మరి వేరే హీరోయిన్స్ వెళ్తున్నారు కదా.. ప్రశ్నించగా.. వారికి జాతకం మీద నమ్మకం ఉంది కావచ్చు. ఆయన దగ్గర చూపించుకుంటే.. వారికి అలా కలిసి రావొచ్చని ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది అనన్య నాగళ్ల. ఇలా ఈ బ్యూటీ జ్యోతిష్యంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Read more about: ananya nagalla
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X