Ananya Panday బాత్రూంలోకి వెళ్లి 20 నిమిషాలు లాక్ వేసుకొన్నా.. అలాంటి షాకింగ్ పాత్రతో అంటూ ఎమోషనల్
బాలీవుడ్‌లో నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వెండితెరపై అందాలతో జిగేల్ అనిపిస్తున్న యువ హీరోయిన్ అనన్య పాండే. గ్లామర్‌కు, పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకొంటూ తనదైన శైలిలో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా విభిన్నమైన సినిమాలను ఎంచుకొంటున్న అనన్య పాండే ముందుకు గెహ్రాయియాన్ అనే చిత్రం ముందుకొచ్చింది. దర్శకుడు షకున్ బాత్రా కథ చెప్పినప్పుడు కలిగిన భావోద్వేగాన్ని మీడియాకు వెల్లడిస్తూ..

కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర
గెహ్రాయియాన్ చిత్రం భావోద్వేగంతో సాగే స్త్రీ, పురుషుల సంబంధాల కథ. నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి కథ నా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి స్క్రిప్టును వినడానికి, విన్న తర్వాత నటించడానికి చాలా ధైర్యం ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి పాత్రలో నటించాల్సి వస్తే నాలాంటి యువ హీరోయిన్లు చాలా ఆలోచిస్తారు. నాకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది అని అనన్య పాండే చెప్పింది

బాత్రూంలో మూర్చకు గురైనంతగా
గెహ్రాయియాన్ సినిమా కథను దర్శకుడు షకున్ బాత్రా చెప్పినప్పుడు షాక్ గురయ్యాను. కథ వినడం పూర్తి కాగానే.. నేను బాత్రూంలోకి వెళ్లవచ్చా? అని అడిగాను. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్లి 20 నిమిషాలు డోర్ లాక్ చేసుకొని ఆ పాత్ర గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. బాత్రూంలో మూర్చ వచ్చినంత పనైంది. దాదాపు కిందపడిపోయే పరిస్థితి కనిపించింది. ఇలాంటి కథ నా వద్దకు వచ్చిందేమిటి? అనే ఆలోచనల్లో పడిపోయాను. ఎమోషనల్‌గా సాగే సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది అని అనన్య పాండే చెప్పింది.

వ్యక్తిగా మారిపోయాను అంటూ
నా కెరీర్ ఆరంభంలో దీపిక పదుకోన్, సిద్ధార్థ్ చతుర్వేదితో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. దాదాపు రెండు నెలలు గోవాలో షూట్ చేశాం. ఆ సమయంలో మేమిద్దరం మంచి స్నేహితులుగా మారిపోయాం. ఈ సినిమా షూట్ జరిగినన్నీ రోజులు ఓ ఫ్యామిలీతో పనిచేస్తున్నానా అనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా నటిగానే కాకుండా మంచి వ్యక్తిగా మార్చివేసింది అని అనన్య పాండే వెల్లడించింది.

నాకు బేబి సిస్టర్ అంటూ
అనన్య పాండే గురించి దీపిక పదుకోన్ మాట్లాడుతూ.. అనన్య నాకు బేబీ సిస్టర్‌గా మారిపోయింది. నా సోదరి అనిషా పదుకోన్ కంటే చాలా చిన్నది. అనన్య పాండే, సిద్‌తో షూటింగ్ చేయడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ సినిమా జీవితాంతం స్నేహితులుగా మారిపోయే ఫ్రెండ్స్‌ను ఇచ్చింది అని దీపిక పదుకోన్ అన్నారు.
Recommended Video

వివాహేతర సంబంధాలపై
ఇక గెహ్రాయియాన్ సినిమా విషయానికి వస్తే.. వివాహేతర సంబంధాలు గురించి విపులంగా చర్చించే మూవీగా రూపొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు, నిజాయితీ, విచ్చలవిడి శృంగారం అంశాల కలయిగా ఈ సినిమా రాబోతున్నది. లవ్, రిలేషన్‌షిప్స్, ప్రస్తుత నాగరిక ప్రపంచంలో యువతి యువకుల మధ్య రిలేషన్స్ గురించి ఎమోషనల్‌గా చెప్పబోతున్నాం అని దర్శకుడు షకున్ బాత్రా చెప్పారు.


Click it and Unblock the Notifications











