ఆ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌తో పెళ్లి - స్వయంగా అసలు విషయం చెప్పిన అంజలి!
హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు హీరోయిన్గా ప్రధాన పాత్రలు పోషిస్తూనే మరోవైపు ఇతర సినిమాల్లో కీలక పాత్రల్లోనూ నటిస్తోంది. అయితే 37 ఏళ్ల వయసు వచ్చినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. చాలా సార్లు ఈమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చేవి. కానీ వాటిని ఆమె కొట్టిపారేస్తూ వచ్చేది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై స్పందించింది. బడా నిర్మాతతో తన పెళ్లి అంటూ చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
తెలుగమ్మాయి నటి అంజలి తెలుగు చిత్ర సీమ ప్రేక్షకులకు బాగానే పరిచయం. నాకు అన్నీ అలా తెలిసిపోతాయ్ అంతే అంటూ ఎంతో మంది అభిమానుల్లో చోటు సంపాదించుకుంది. మొదట షాపింగ్ మాల్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తెలుగులో వచ్చేసరికి 2006లో ఫోటో అనే సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను పరిచయం చేసుకుంది. అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలా వచ్చిన గుర్తింపుతో మసాలా సహా పలు చిత్రాల్లో నటించింది. కానీ ఇక్కడ స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది.

దీంతో తమిళంలోకి వెళ్లి అక్కడే నటిస్తూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక్కడ మాత్రం సెకండ్ హీరోయిన్గా, సపోర్టింగ్ రోల్స్‌తో మెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్‌లోనూ చిందులేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే 2014లో అంజలి నటించిన కామెడీ హార్రర్ థ్రిల్లర్ గీతాంజలి విడుదలై ఆమెకు ఇక్కడ మరో మంచి సక్సెస్‌ను ఇచ్చింది. త్వరలోనే దానికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వస్తోంది అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈమె పర్సనల్ విషయానికొస్తే 37 ఏళ్ల వయసు వచ్చినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. చాలా సార్లు ఈమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చేవి. అయితే ఆ మధ్య ఈమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ తెలుగు నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగింది. పెళ్లై విడాకులు తీసుకున్న నిర్మాతతో ఆమె ఏడడగులు వేయబోతున్నట్లు అన్నారు. కానీ అన్నింటినీ ఆమె కొట్టి పారేస్తూ వచ్చింది.

తాజాగా ఆమె ఈటీవీలో ప్రతి మంగళవారం ప్రేక్షకులను అలరించే సెలబ్రిటీ టాక్ షో ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై సందడి చేసింది. ఇందులో తన కొత్త సినిమా గీతాంజలి మళ్లీ వచ్చేసింది నిర్మాత కోన వెంకట్‌తో కలిసి వచ్చి ఆసక్తికర విషయాలను పంచుకుంది. వాన చిలుకులు సాంగ్‌కు చిందులు వేసింది. షోలో భాగంగా తన పెళ్లి వార్తలపై అంజలి స్పందించింది.
అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావంటా అంటూ అలీ అడగగా - అగ్రనిర్మాత అంటూ నవ్వులు పూయించింది. దీని బట్టి ఆమె తన రూమర్స్ గురించే మాట్లాడినట్లు అర్థమైంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పెళ్లి కల వచ్చేసింది బాలా అంటూ సాంగ్ వేశారు. గీతాంజలి సినిమా కథ గురించి కూడా మాట్లాడింది. దెయ్యాలతో సినిమా షూటింగ్ ఈ సినిమా కథ బ్యాక్‌డ్రాప్ అని చెప్పుకొచ్చింది. స్పెషల్ సాంగ్స్‌లో చేయడానికి గల కారణాలను కూడా తెలిపింది.
గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో తనకు నరాలు పట్టేసినట్లు గుర్తుచేసుకుంది. తాను అల్లరి బాగా చేస్తానని చెప్పుకొచ్చింది. సీతమ వాకింట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాట పాడి అలరించింది. ఇంకా కామెడీ విషయాలు మాట్లాడుతూ నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











