Game Changer: గేమ్ ఛేంజర్‌లో నా రోల్ అలాంటిది.. లీక్ చేసిన హీరోయిన్ అంజలి
దక్షిణాది సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలంగా కెరీర్ కొనసాగిస్తున్న హీరోయిన్లలో అంజలి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. తెలుగు అమ్మాయిగా పరాయి భాషలో తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తనదైన రీతిలో రాణిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించే ప్రయత్నం చేస్తున్నది. అయితే తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ఆడియెన్స్ ఆకట్టుకొన్న ఈ భామ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో మరోసారి ప్రేక్షక దేవుళ్లను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ..
ప్రస్తుతం నేను కథలో పాత్రలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నా రోల్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. విశ్వక్ సేన్, నేను పోటాపోటీగా నటించాం. హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నాను. నాది ఈ చిత్రంలో బలమైన పాత్ర అంటూ కామెంట్ చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారలో పని చేయడం సంతోషంగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. అలాంటి నిర్మాణ సంస్థ తోడు కావడం వల్లే.. ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది అని అన్నారు

ఇక గేమ్ ఛేంజర్‌లో కూడా నాది బలమైన పాత్ర. కీలకమైంది.. గెస్ట్ అప్పీయెరెన్స్ రోల్ కాదు. ఇద్దరు హీరోయిన్లు ఉంటే.. అందులో నాది కూడా ముఖ్యమైన పాత్రే. కథకు బలంగా ఉండే క్యారెక్టర్ నాది. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ తర్వాత నా పాత్ర ఏమిటో మీకే అర్ధం అవుతుంది. దాని గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అంటూ ఆమె ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో నటించడం గొప్ప ఫీలింగ్. ఇప్పటికే ఆయన గురించి చాలా సందర్బాల్లో చెప్పాను. తన పాత్ర కోసం ప్రాణం పెడుతాడు.నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి పరితపిస్తారు. కేవలం ఆయన రోల్ గురించే కాకుండా ఇతర నటీనటుల సెట్స్‌లో సహకారం అందిస్తారు అని అంజలి చెప్పింది.

ప్రస్తుతం తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. గేమ్ చేంజర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానున్నది. మరో తెలుగు సినిమా అంగీకరించాను. తమిళంలో మూడు సినిమాలు, అలాగే మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను. ప్రస్తుతం ఫుల్ బిజీగా కెరీర్ కొనసాగుతున్నది అని అన్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే..మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది.


Click it and Unblock the Notifications











