Anupama Parameshwaran: "సిద్ధుతో రొమాన్స్ చేయడానికి కారణం అదే.. ఆ తొలి అనుభవాన్ని మర్చిపోలేను"
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో రాబోతున్న సరికొత్త చిత్రం టిల్లు స్క్వేర్. ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా చాలా పద్ధతిగా కనిపించే అనుపమ ఇంత ఘాటుగా రొమాన్స్ చేయడానికి ఎలా ఓకే చెప్పిందని చాలా మందికి అనుమానం. ముఖ్యంగా లిల్లీగా మారిపోయి సిద్ధుతో డీప్ లిప్ లాక్ సీన్లు చేయడం చూసి చాలా మంది షాక్ అయ్యారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ తొలి సారి ఈ సినిమా గురించి మాట్లాడింది. తాను సిద్ధుతో ఇంత ఘాటుగా రొమాన్స్ చేయడానికి గల కారణం ఏంటో కూడా వివరించింది. అలాగే తనను తాను ఓ రొమాంటిక్ పాత్రలో చూసుకోబోతున్నందుకు చాలా థ్రిల్ అవుతున్నట్లు కూడా వివరించింది. ఈ ఎక్స్ పీరియన్స్ ను ఎప్పటికీ మర్చిపోలేనని కూడా చెప్పింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం

డీజే టిల్లు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సిద్ధు.. తాజాగా దానికి సీక్వెల్ తో రాబోతున్నాడు. ముఖ్యంగా పార్ట్ 1 కంటే పార్ట్ 2ను మరింత అద్భుతంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతుంది. ఇప్పటి వరకు విడుదల అయిన టీజర్లు, పస్టర్లు, పాటలు చూస్తుంటే రొమాంటిక్ సీన్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్లు అర్థం అవుతోంది. అయితే మల్లిక్ రామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అనుపమను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఇప్పటి వరకు చాలా పద్ధతైన పాత్రల్లో కనిపించిన అనుపమ ఇలాంటి పాత్రలో కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. అలాగే ఈ సినిమా ఆఫర్ తన వద్దకు వచ్చినప్పుడు అనుపమ కూడా ఇలాగే ఫీల్ అయిందట. అదేంటి ఈ సినిమాతో వీళ్లు నా దగ్గరకు వచ్చారని అనుకుందట. సినిమా కథ మొత్తం విన్న తర్వాత బాగానే అనిపించినా.. తాను ఇలాంటి పాత్రలో చేస్తానో లేదోనని చాలా ఆలోచించిందట.

అయితే ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేయడంతో చాలా బోర్ గా ఫీల్ అయిన తాను.. ఏదైనా కొత్త పాత్ర చేయాలనుకుందట. అలాంటి సమయంలోనే టిల్లు స్క్వేర్ సినిమా తన వద్దకు రాగా... చాలా ఆలోచించి ఇందులో చేసేందుకు ఓకే చెప్పిందట. ఆ తర్వాత కూడా ఈ సినిమా చేయాలా వద్దా అని పదే పదే ఆలోచించుకుని.. కచ్చితంగా చేయాలని డిసైడ్ అయిపోయిందట. అలా ఈ చిత్రంలో సిద్ధుతో రొమాన్స్ చేసినట్లు వివరించింది.
ఎప్పుడూ తనను తాను ఒకే తరహా పాత్రల్లో చూసుకున్న తనకు.. ఈసారి చాలా కొత్తగా అనిపిస్తుంది... ఈ ఎక్స్ పీరియన్స్ ను ఎప్పటికీ మర్చిపోలేనని అనుపమ పరమేశ్వరన్ వెల్లడించింది. అలాగే ఈ సినిమా కోసం తనను తీసుకోవడానికి కారణం తన కళ్లేనని.. అప్పటి వరకు దేవతలా కనిపిస్తూ, సడెన్ గా దెయ్యంలా చూడాలని.. ఇలా రెండు రకాల వేరియేషన్స్ చూపించేందుకు పెద్ద కళ్లు ఉన్న అమ్మాయ కావాలనుకున్నారట.
కాబట్టి ఈ పాత్రకు తాను అయితేనే బాగా సెట్ అవుతానని మూవీం టీం భావించినట్లు కూడా వివరించింది. చూడాలి మరి మార్చి 29వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందనేది.


Click it and Unblock the Notifications











