రెమ్యూనరేషన్ డబుల్ చేసిన అనుపమ... టిల్లుతో సక్సెస్ అట్లుంటది మరి
రీసెంట్ గా టిల్లు స్క్వేర్ ఇచ్చిన సక్సెస్ తో దూసుకెళ్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన రెమ్యూనరేషన్ డబుల్ చేసింది. ఇదివరకు ఒక్కో సినిమాకు కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న అనుపమ ప్రస్తుతం రెండు కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని సమాచారం.
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ ఇచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. అందులో భాగంగానే ఈ బ్యూటీ తన పారితోషకాన్ని డబుల్ చేసినట్టు సమాచారం. మరి అనుపమ ఇదివరకు ఎంత పారితోషం తీసుకునే? ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తోంది అని ఇంట్రెస్టింగ్ విషయంపై లుక్ చేద్దాం.

రీసెంట్ గా టిల్లు స్క్వేర్ మూవీతో 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ గా రికార్డును క్రియేట్ చేసింది అనుపమ. ఆమె సినిమాల్లోకి వచ్చి చాలా ఏళ్ళే గడుస్తున్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది.
కానీ పెద్దగా సక్సెస్ రాకపోవడంతో రూటు మార్చి టిల్లు స్క్వేర్ మూవీలో గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా సిద్దు జొన్నలగడ్డతో లిప్ లాక్ సీన్లలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు వరుస ఆఫర్లు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి.

మలయాళ చిత్రం ప్రేమమ్ తో సినిమా ఇండస్ట్రిలోకి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గత తొమ్మిదేళ్లుగా అన్ని దక్షిణ భారత భాషలలోని సినిమాలలో కనిపించింది. అయితే ఆమె గత రెండు తెలుగు చిత్రాలైన కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
ఇక ప్రస్తుతం ఆ రెండు సినిమాలు తెచ్చి పెట్టిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్న అనుపమ తన రాబోయే సినిమాలకు పారితోషికాన్ని రెట్టింపు చేసిందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో ఒక్కో సినిమాకు కోటి రూపాయలు పారితోషికంగా వసూలు చేసిన అనుపమ, ఇప్పుడు మాత్రం ఏకంగా 2 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

దానికి తగ్గట్టుగానే టిల్లు స్క్వేర్ మూవీతో ఆమె ఫాలోయింగ్ కూడా ఆ రేంజ్ లో రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఖాతాలో వరసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఉండడం విశేషం. బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆక్టోపస్ అనే సినిమాను చేస్తున్నారు.
అలాగే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా బైసన్, లాక్ డౌన్ అనే మరో రెండు ప్రాజెక్టులు కూడా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తమిళ మూవీ బైసన్. ఇదో స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఇక లాక్ డౌన్ మూవీకి ఏఆర్ జీవా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న మరో మళయాల మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటన్నింటితో పాటే అనుపమ పెట్ డిటెక్టివ్ అనే తమిళ చిత్రంలో కూడా కనిపించనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా టిల్లు స్క్వేర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతోంది.


Click it and Unblock the Notifications











