యువ హీరోను ఆటపట్టించిన అనుష్కశెట్టి.. ప్రాంక్ కాల్‌తో ఏడిపించినంత పనిచేసిన జేజమ్మ!

టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ అనుష్కశెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. అనుష్కశెట్టి చెఫ్‌గా, నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నవీన్ పొలిశెట్టి టెలివిజన్ ఛానెల్‌ ద్వారా తన అభిమానులతో తన అనుభవాలను, అభిప్రాయలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా అనుష్క శెట్టి చేసిన ప్రాంక్ కాల్ వైరల్‌గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన టెలిఫోన్ కాల్ వివరాల్లోకి వెళితే..

నవీన్ పోలిశెట్టి తన అభిమానులతో ఫోన్ కాల్‌లో మాట్లాడుతుండగా.. అనుష్క శెట్టి కాల్ చేసింది. తాను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మంచి స్టాండప్ కమెడియన్ కదా. మా ఇంటిలో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌లో మీరు కామెడీ చేయాలి. మీరు మా ఫంక్షన్‌లో కామెడీ చేస్తారా? అని నవీన్ పోలిశెట్టిని అనుష్క శెట్టి అడిగింది.

 Heroine Anushka Shetty

అనుష్క శెట్టి అడిగిన ప్రశ్నకు నవీన్ పొలిశెట్టి సమాధానం ఇస్తూ.. ఫంక్షన్ బెంగళూరులోనా? ఏం ఫంక్షన్ అని అడిగితే.. మా బంధువుల మామయ్య కూతురు పెళ్లి అని సమాధానం చెప్పింది. అంతేకాకుండా మీరు పెళ్లికి సంబంధం లేకుండా కామెడీ చేయాలని అనుష్కశెట్టి చెప్పింది. దాంతో ఇంతకు మీరు ఎవరు? మీ పేరు ఏమిటి అని అడిగితే.. నా పేరు ఎందుకులే అంటూ దాటవేసే ప్రయత్నం చేసింది.

 Heroine Anushka Shetty

బెంగళూరులో మా ఇంట్లో పెళ్లి వేడుక సెప్టెంబర్ 7వ తేదీన జరుగుతుంది అని అనుష్క అంటే.. ఆ రోజు మా సినిమా రిలీజ్ కూడా అదే రోజు అని నవీన్ పొలిశెట్టి చెప్పారు. అయితే ఫోన్ కాల్ సంభాషణ సందర్భంగా అనుష్క శెట్టి వాయిస్‌ను నవీన్ శెట్టి గుర్తుపట్టారు. మీరు మరోసారి మాట్లాడండి.. మీ పేరు ఏమిటి అంటే.. నా పేరు ఎందుకులే అంటూ ప్రశ్నలను దాటవేస్తుండగా.. నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. 18 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అనుష్క గురించి చెప్పడంతో సంభాషణ సరదాగా సాగింది.

 Heroine Anushka Shetty

ఇదిలా ఉండగా, ఐదేళ్ల తర్వాత అనుష్క శెట్టి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాహుబలి తర్వాత భాగమతి చేస్తున్న సమయంలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కథ చెప్పారు. ఆ సమయంలో నిశ్శబ్దం సినిమా చేశాను. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో రిలీజైంది. మళ్లీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలకు హాజరు అవుతాను అని అనుష్క శెట్టి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X