Happy Ending చాలా బోల్డ్ స్టోరి.. హీరో అలాంటి కోరికతో.. హ్యాపీ ఎండింగ్ హీరోయిన్ అపూర్వ రావు
యువ హీరో, హీరోయిన్లు అపూర్వ రావు, యష్ పూరి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ భీమిడి రూపొందించిన చిత్రం హ్యాపీ ఎండింగ్ (Happy Ending). హ్యామ్స్‌టెక్ ఫిలింస్, సిల్లీమాంక్స్ స్టూడియోస్ బ్యానర్‌పై యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఫిల్మీబీట్ తెలుగుతో హీరోయిన్ అపూర్వ రావు మాట్లాడుతూ..
హ్యాపీ ఎండింగ్ సినిమాలో వావ్ అనే కంటెంట్, అలాగే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే బోల్డ్ ఫ్యాక్టర్ రెండు ఉన్నాయి. నేను మొదటిసారి స్టోరి వినగానే నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుందని అనిపించింది అనేది నా ఫీలింగ్ అని అపూర్వ రావు చెప్పారు.

హ్యాపీ ఎండింగ్ స్టోరి చాలా బోల్డ్. కానీ రియల్ ఎమోషన్స్ పాత్రల మధ్య ఉంటాయి. కానీ నాది బోల్డ్ పాత్ర కాదు. ఈ మూవీలో హీరో పాత్రకు శాపం ఉంది. ఆ హీరోకు రొమాంటిక్ డ్రీమ్ ఉంటుంది. నువ్వొస్తానంటే నేను వద్దంటానా, బోమ్మరిల్లు, హమ్ తుమ్ లాంటి రొమాంటిక్, ఫ్యామిలీ సినిమా ఇది. నా వరకు నేను ఎమోషనల్ పాత్రలో నటించాను అని అపూర్వ రావు చెప్పారు.
apoorva rao happy ending yash puri kowshik bheemidi anil pallala అపూర్వ రావు హ్యాపీ ఎండింగ్ యష్ పూరి కౌశిక్ భీమిడి అనిల్ పల్లాల


Click it and Unblock the Notifications