‘ఆ హీరోకు మితిమీరిన కోరికలు.. అలాంటి పరిస్థితుల్లో కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది’

హ్యామ్స్‌టెక్ ఫిలింస్, సిల్లీమాంక్స్ స్టూడియోస్ బ్యానర్‌పై యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలుగా కౌశిక్ భీమిడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం హ్యాపీ ఎండింగ్. ఈ చిత్రంలో యష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్, నిర్మాత, దర్శకులు మాట్లాడుతూ..

హ్యాపీ ఎండింగ్ సినిమా కథను దర్శకుడు కౌశిక్ భీమిడి చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది. ఒక అబ్బాయి గురించిన కథ. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఒక శాపం ఉంటుంది. మాములుగా సాధారణ జనాలకు కోరికలు సహజంగా ఉంటాయి. కానీ ఈ అబ్బాయికి మాత్రం చాలా ఎక్కువగా, మితిమీరిన కోరికలు ఉండటంతో అతడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అపూర్వ రావు చెప్పారు.

Heroine Apoorva Rao Reveals Bold Character in Happy Ending Trailer Launch Event

అసాధారణమైన కోరికలతో ఉన్న అలాంటి అబ్బాయికి ఓ అమ్మాయి అవసరం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో నేను పరిచయం అవుతాను. అప్పుడు అమ్మాయి, అబ్బాయి మధ్య ఏం జరుగుతుంది అనేది కథ. రిలీజైన ట్రైలర్ మీకు క్యూరియాసిటీని కలిగించిందని అనుకొంటాను అని అపూర్వరావు తెలిపారు.

Heroine Apoorva Rao Reveals Bold Character in Happy Ending Trailer Launch Event

కథ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. వావ్ అని నాకు అనిపించినట్టుగానే.. ప్రేక్షకులకు కూడా అనిపిస్తుందని అనుకొన్నాను. కథలో బోల్డ్ ఉంటుంది. కానీ నా క్యారెక్టర్‌ బోల్డ్ కాదు. నా ఫెర్ఫార్మెన్స్ బోల్డ్‌గా ఉండదు. ఈ కథలో హీరో క్యారెక్టర్‌కు శాపం ఉంటుంది. నాకు ఎలాంటి సమస్య ఉండదు. నా రొమాంటిక్ లైఫ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాను అని అపూర్వరావు చెప్పారు.

హీరో యష్ పూరి మాట్లాడుతూ.. మూఢ నమ్మకాలకు, శాపాలకు చిన్న తేడా ఉంటుంది. కానీ హ్యాపీ ఎండింగ్ సినిమాలో నా క్యారెక్టర్ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతుంది. ఈ సినిమా లైంగిక సమస్యలతో బాధపడే అబ్బాయి కథ. అన్ని వర్గాలను ఆకట్టుకొంటుంది. కొత్తవాళ్లం అందరం కలిసి సినిమా చేశాం. ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు. మాకు సపోర్ట్ చేయండి అని అన్నారు.

Heroine Apoorva Rao Reveals Bold Character in Happy Ending Trailer Launch Event

మా జీవితాల్లో హ్యాపీ ఎండింగ్ గురించి చెప్పాలంటే.. నా జీవితంలో ఈ సినిమా రిలీజయ్యే ఫిబ్రవరి 2వ తేదీ హ్యాపీ ఎండింగ్ అనుకొంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే అది నిజం అవుతుంది. ఈ సినిమాలో ఎలాంటి అసౌకర్యం కలిగించే సీన్ల ఉండవు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమా అని హీరో పూరి చెప్పారు. నాకు ఇది తొలి సినిమా. రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పుడు హ్యాపీ ఎండింగ్ మూమెంట్‌గా అనిపించింది అని దర్శకుడు కౌశిక్ అన్నారు. ఫస్ట్ టైమ్ నేను స్టోరి విన్నప్పుడు నాకు హ్యాపీ ఎండింగ్‌లా అనిపించింది అని హీరోయిన్ అపూర్వ చెప్పారు. ఈ సినిమా చేసే ప్రాసెస్‌లో ప్రతీ మూమెంట్ హ్యాపీ ఎండింగ్ అన్నారు.

నటీనటులు: యష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్, విష్ణు ఏఐ, ఝాన్సీ, అనితా చౌదరీ తదితరులు
దర్శకత్వం: కౌశిక్ భీమిడి
నిర్మాతలు: యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
బ్యానర్: హ్యామ్స్‌టెక్ ఫిలింస్, సిల్లీమాంక్స్ స్టూడియోస్
మ్యూజిక్: రవి నిడమర్తి
డీవోపీ: అశోక్ సీపల్లి
స్క్రీన్ ప్లే: నాగసాయి
ఎడిటర్: ప్రదీప్ ఆర్ మోరం
రిలీజ్ డేట్: 2024-02-02

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X