నా బొంగేం కాదు.. హాట్ హీరోయిన్ అప్సరా రాణి షాకింగ్ కామెంట్స్
యువ హీరోయిన్ అప్సరా రాణి నటించిన తాజా చిత్రం తలకోన. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్నది. అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకొంటున్నాయి. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీకి నగేష్ నారదాసి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్‌కు హాజరైన అప్సరారాణి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అప్సరా రాణి డబ్బింగ్ థియేటర్‌లో చేసిన అల్లరి విషయంలోకి వెళితే..
అప్సరాణి ప్రధాన పాత్రలో నటించిన తలకొన చిత్రం డబ్బింగ్ పనులు జోష్‌గా మొదలయ్యాయి. తన పాత్రకు డబ్బింగ్ చెబుతూ.. నా బొంగు ఏం కాదు.. నా బొంగు ఏం కాదు అంటూ డబ్బింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత తన పాత్ర గురించిన విజువల్స్‌ను తెరపైన చూస్తూ మురిసిపోయింది. డబ్బింగ్ థియేటర్‌లో ఉత్సాహంగా కనిపించింది.

డబ్బింగ్ థియేటర్‌లో మీడియాతో అప్సరా రాణి మాట్లాడుతూ.. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. తలకొన సినిమా కోసం నేను నా కెరీర్ బెస్ట్ ఇచ్చాను. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నా కెరీర్‌లో ఛాలెంజింగ్ ఉన్న పాత్ర చేస్తున్నాను. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఈ సినిమా నాకు కొత్త అనుభూతిని కలిగించింది అని అప్సరా రాణి అన్నారు.
తలకొన సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో మహిళా చైతన్యం ఎలా ఉండాలో దర్శకుడు నగేష్ చెప్పబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చిత్రీకరించిన విధానం పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నిర్మాత శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు. ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా చాలా మార్పులు తెస్తుంది అని అప్సరా రాణి అన్నారు.

తలకొన సినిమా దర్శకుడు నగేష్ మాట్లాడుతూ.. రెండు షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశాం. రెండో షెడ్యూల్ తలకొనలో పూర్తి చేశాం. ప్రస్తుతం ఎడిటింగ్ కూడా పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అప్సర రాణి క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా అవుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











