త్రిషతో ఫ్రెండ్‌షిప్ వల్లే నా కెరీర్ నాశనం.. అలా బలవంతం చేసి అంటూ అర్చన సంచలనం!

సినీ తారల్లో కొందరి ఖాతాల్లో హిట్స్ పడకున్నా వాళ్లకు చెరిగిపోని గుర్తింపు వస్తుంది. తమ కట్టుబొట్టుతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంటారు. అలాంటివారి లిస్టులో నటి అర్చన ఒకరు. హీరోయిన్ గా పెద్దగా రాణించని ఈ భామ.. కొన్ని క్యారెక్టర్స్‌తో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది అర్చన. కొన్ని కారణాల వల్ల తన కెరీర్ నాశనం అయిందని తెలుపుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

అందానికి అందం అర్చన:
తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో పలు సినిమాల్లో నటించింది అర్చన. తపన, నేను, కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఖలేజా, శ్రీరామ దాసు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అందానికి అందం, అందుకు తగ్గ నటనతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Heroine Archana Shastry sensational comments on Relation with Trisha and her career

నువ్వొస్తానంటే నేనొద్దంటానా:
కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అర్చన.. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేసింది. హీరోయిన్ గా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాని ఈ భామ, తన కెరీర్ ఇలా కావడానికి కారణాలు చెప్పింది. తన కెరీర్ నాశనం కావడానికి కారణం ఒకే ఒక్క చిత్రం అంటూ ఓపెన్ అయింది అర్చన. అదే సిద్దార్థ్, త్రిష హీరోహీరోయిన్లుగా వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా అని చెప్పేసింది.

త్రిష ఫ్రెండ్.. కెరీర్ నాశనం
ఈ సినిమాలో త్రిషకి స్నేహితురాలిగా నటించింది అర్చన. అప్పుడప్పుడే హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న సమయంలో అర్చన ఈ సినిమా చేసింది. అప్పుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ఫ్రెండ్ గా నటించాలని తనను అడిగారని, తనకు అస్సలు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించారని తెలిపింది. ఆ సినిమా సూపర్ హిట్ కావొచ్చు గానీ తన కెరీర్‌ని మాత్రం దెబ్బతీసిందని చెప్పింది అర్చన.

Heroine Archana Shastry sensational comments on Relation with Trisha and her career

హీరోయిన్ ఛాన్సులు మిస్:
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా తర్వాత ఈమె హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిందనే ముద్ర తనపై పడిందని.. దాంతో తనను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారని చెప్పింది అర్చన. అలా నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ తర్వాత హీరోయిన్ గా ఛాన్సులు బాగా తగ్గిపోయాయని పేర్కొంటూ సంచలన కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X