బాయ్ ఫ్రెండ్ తో చిన్నారి పెళ్లి కూతురు రొమాన్స్.. పెళ్లి గురించి మాత్రం అడక్కండి!
సినిమా ప్రపంచంలో ఒక్కసారి క్లిక్కయితే చాలు హీరోయిన్స్ ఈజీగా అవకాశాలు అందుకుంటారని అనుకుంటారు. అందంతో పాటు కాస్త గ్లామర్ డోస్ పెంచితే అవకాశాలు వస్తాయనే కామెంట్స్ కూడా బాగానే వినిపిస్తుంటాయి. కానీ కొంత మంది లక్కేమిటో గాని జనాల్లో ఆదరణ ఎంత పెరిగినా అవకశాలు మాత్రం అనుకున్నంత రేంజ్ లో రావు. ఇక చిన్నారి పెళ్లి కూతురు సిరియల్ తో అప్పట్లో ఎంతగానో క్రేజ్ అందుకున్న అవికా కొన్ని సినిమాలతో బాగానే క్రేజ్ అందుకుంది.

ఆఫర్స్ ఎన్ని వచ్చినా..
చిన్నారి పెళ్లి కూతురు సిరియల్ ద్వారా దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అవికా గోర్ టీనేజ్ వయసు దాటాక హీరోయిన్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా మెరిసి ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఆ తరువాత గ్యాప్ లేకుండా పదుల సంఖ్యలో ఆఫర్స్ రావడంతో కేవలం తనకి సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకొని హిట్స్ కొట్టింది.

ప్రేమ విషయాన్ని బయటపెట్టేసింది
అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల ఈ బ్యూటీ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. తన బాయ్ ఫ్రెండ్ మిలింద్ చద్వాని అంటూ సోషల్ మీడియాలో కొన్ని రొమాంటిక్ ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ సడన్ షాక్ ఏమిటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ చాలానే వచ్చాయి.

పెళ్లిపై షాకింగ్ కామెంట్
రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా అవికా పెద్దగా పట్టించుకోలేదు. అలాగే తను ప్రేమలో లేనని ఇన్నాళ్లు ఎదో కవర్ చేసుకుంటూ వచ్చింది. సింగిల్ గానే ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ అమ్మడు ఫొటోస్ షేర్ చేసి మరీ సడన్ షాక్ ఇచ్చింది. ఇక పెళ్లెప్పుడు అని ఎవరు అడగక ముందే.. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని క్లారిటీ ఇచ్చేసింది.

అదృష్టంగా ఫీల్ అవుతున్నాను
గత కొన్నేళ్ల నుంచి అవికా డేటింగ్ లో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఇద్దరి మనసులు దగ్గరవ్వడంతో ప్రపంచానికి క్లారిటీ ఇచ్చేశారు. ఫైనల్ గా తనకు నచ్చిన వాడు దొరికాడు అంటూ.. ఇద్దరు మనసులు ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. నాకు ఈ ప్రేమ దొరికినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అయితే పెళ్లి ఆలోచన మాత్రం ఇంకా రాలేదు. కెరీర్ లో ఇంకా చాలా సాధించాల్సి ఉందని అవికా చాలా క్లారిటీగా చెప్పేసింది.


Click it and Unblock the Notifications











