Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నిర్మాతగా మారుతున్న చిన్నారి పెళ్లి కూతురు!
కొంతమంది హీరోయిన్స్ స్టార్ హీరోలతో పెద్దగా అవకాశం అందుకోకపోయినా కూడా ఆడియెన్స్ అంత ఈజీగా మరచిపోలేరు. అలాంటి వారిలో అవికా గోర్ ఒకరు. ఈ నార్త్ భామ చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ఆడియెన్స్ మనసులో తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ఒకప్పుడు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియేన్స్ కు దగ్గరైన విషయం తెలిసిందే.
అనంతరం హీరోయిన్ గా చేసిన ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ సినిమాలతో తన స్థాయిని మరింత పెంచుకున్న అవికా కొన్నాళ్ల వరకు మంచి ఆఫర్స్ తో బాగానే ముందుకు సాగింది. కానీ ఆమె స్థాయి కేవలం చిన్న బడ్జెట్ సినిమాలకే పతిమితం అయ్యింది. అయినప్పటికీ అవికా ఏ మాత్రం నిరాశ చెందకుండా ముందుకు సాగుతోంది. ఇక ఈ క్యూట్ గర్ల్ చాలా రోజుల తరువాత ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది.
కొత్తగా ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసిన అవికా మొదటి సినిమాను నిర్మించడానికి సిద్ధమైంది. నెపోలియన్ సినిమా నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి ప్రస్తుతం ఆచార్య క్రియేషన్స్ పై అవికా గోర్ తో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఆ సినిమా కోసం అవికా గోర్ కొత్తగా అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి సహా నిర్మాతగా కొనసాగేందుకు రెడీ అయ్యింది. మురళీ నాగ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో సాయి రోవర్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.