భాగ్యశ్రీ 200 కోట్లు.. ఈమె క్రేజ్ ఈ లెవెల్లో ఉందా.. హరీష్ రెస్పాన్స్ వైరల్
ప్రతి సినీ ఇండస్ట్రీ లోకి కూడా మారుతున్న కాలంతో పాటుగా కొత్త కొత్త హీరోలు హీరోయిన్స్ కూడా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అయితే ఎక్కడైనా కూడా చాలా వరకు హీరోలదే పైచేయి ఉంటుంది కానీ వారి సరసన నటించే హీరోయిన్స్ కూడా కొంతమంది చక్రం తిప్పుతారు. కాగా ఇలా ప్రతి జెనరేషన్ లో కూడా ఒకో హీరోయిన్ ఒకో ఇండస్ట్రీలో తన హవా నడిపిస్తుంది. మన తెలుగు సినిమాలోనే చూసుకుంటే ఎంతోమంది అగ్ర నటులు కనిపిస్తారు.
అయితే ఇప్పుడు మారిన కాలంతో పోటీ కూడా భీభత్సంగా పెరుగుతూ వస్తుంది. ఇలా చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుండడంతో డిమాండ్, ఆడియెన్స్ లో టేస్ట్ కూడా మారుతూ వస్తుంది. కాగా ఇపుడు టాలీవుడ్ లోనే చూస్తే గడిచిన రెండు మూడేళ్ళ లోనే నిధి అగర్వాల్ అని, నభా నటేష్ అని కృతి శెట్టి ఇంకా శ్రీలీల రష్మికా మందన్నా వంటి వారు ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలం లోనే హవా చూపించారు.

కాగా ఇప్పుడు వీరికి గట్టి పోటీ ఇచ్చేలా మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే ట్రెండింగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ అని చెప్పాలి. మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో హీరోయిన్ గా నటించి తెలుగులో పరిచయం కాబోతుంది. కాగా రీసెంట్ టైంస్ లో అయితే ఈమెకి వచ్చిన బజ్ మరో హీరోయిన్ కి రాలేదనే చెప్పాలి.
ఇలా సోషల్ మీడియాలో కూడా నెటిజన్స్ భాగ్యశ్రీ జపమే చేస్తున్నారు. అయితే తాజాగా హరీష్ శంకట్ ఓ నెటిజన్ కి ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. రవితేజ, అలాగే హరీష్ శంకర్ లు చూడని హిట్స్ బ్లాక్ బస్టర్ లు లేవు కానీ భాగ్యశ్రీ కోసం అయినా మిస్టర్ బచ్చన్ హిట్ అయ్యి అది 200 కోట్లు కొట్టాలి అని. ఈ సినిమాతో ఆమె 200 కోట్ల హీరోయిన్ గా నిలవాలి అంటూ నెటిజన్ పోస్ట్ చేస్తే దానికి హరీష్ శంకర్ ఫెళ్ళున నవ్వుతున్నట్టుగా రిప్లై ఇచ్చాడు.

దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కానీ ఇక్కడ ఇంకొకటి, ఆమె మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఆడియెన్స్ లో ఈ రేంజ్ క్రేజ్ ని ఆమె సొంతం చేసుకోవడం విశేషమే అని చెప్పాలి. కుర్రకారు మనసులు కొల్లగొట్టిన ఈ హీరోయిన్ కి తెలుగులో ఎలాంటి ఎంట్రీ దక్కుతుందో చూడాలి.
ప్రస్తుతానికి అయితే ఆమె విషయంలో ఎలా ఉన్నా జనం చూసేలానే ఉన్నారు. సినిమాలో కూడా మంచి ఎనర్జిటిక్ గా గ్లామర్ షోతో కనిపిస్తుంది. మరి టాలీవుడ్ లో తాను పాగా వేస్తుందో లేక చాలా హీరోయిన్స్ లానే ఒక్క సినిమా సినిమాతోనే అటెన్షన్ తెచ్చుకొని మళ్ళీ వెనక్కు వెళ్లిపోతుందో ఏమో అనేది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











