ఖుషీలో పవన్‌కు నా నడుము చూపించమనగానే.. భూమికా చావ్లా ఫీలింగ్ ఏమిటంటే?

చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది భూమిక. అమాయకమైన చూపు, ముఖంపై చిరునవ్వుతో ఒక తరం యువతకు నిద్రలేకుండా చేసింది . ఉత్తరాది అమ్మాయే అయినా తెలుగు చిత్రాలతోనే నటిగా ఓ వెలుగు వెలిగింది. కింగ్ అక్కినేని నాగార్జున నిర్మించిన యువకుడు చిత్రం ద్వారా భూమిక వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ భూమిక అందం, నటన కుర్రకారును ఆకర్షించింది. ఆ వెంటనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - ఎస్‌జే సూర్యల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖుషి బ్లాక్‌బస్టర్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

తెలుగులో వెను వెంటనే సింహాద్రి, ఒక్కడు, వాసు, స్నేహమంటే ఇదేరా, జై చిరంజీవా, సాంబ, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలలో నటించి అగ్ర కథానాయకగా వెలుగొందారు. లేడి ఓరియెంటెడ్ మూవీస్‌కి కూడా భూమిక ట్రెండ్ సెట్ చేశారు. మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి వంటి సినిమాలు ఘన విజయం సాధించి ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అదే సమయంలో తమిళంలోనూ తన లక్ పరీక్షించుకోవాలని భావించింది. కానీ తమిళ తంబిలకు అంతగా కనెక్ట్ కాలేదు.

Heroine bhumika chawla recalls beutiful moments of Kushi hip scene

హిందీలో తెరేనామ్, రన్ వంటి చిత్రాల్లో నటించింది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా సాంప్రదాయ దుస్తుల్లోనే అందంగా కనిపించడం భూమిక స్టైల్. నటిగానే కాకుండా సాహిత్యాన్ని ఇష్టపడే ఆమె దాదాపు 100కు పైగానే పోయంస్ రాసిందట. అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని భావించిన భూమిక.. తన చిరకాల స్నేహితుడు, యోగా గురు భరత్ ఠాకూర్‌ను 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన వయసు, అనుభవానికి తగిన పాత్రలే చేస్తున్నారు భూమిక. ఎంఎస్ ధోని బయోపిక్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి సినిమాలు ఆమెకు పేరు తీసుకొచ్చాయి.

ఇటీవలి కాలంలో వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లతో సెగలు రేపుతోంది భూమిక. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, సినిమాల సంగతులను పంచుకుంటున్నారు . ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ , ఏ వివాదంలోనూ తలదూర్చకుండా తన పని తాను చేసుకెళ్తున్నారు భూమిక. అయితే తాను ఓ మూవీ షూటింగ్ సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడినట్లుగా చెప్పారామె. అది మరేదో కాదు.. ఖుషి. పవన్ కళ్యాణ్ ఆల్‌టైమ్ మూవీ ఏది అంటే ఠక్కున చెబుతారు అభిమానులు. ఇందులో పవన్ మేనరిజమ్, స్టైల్స్, పాటలు యువతను ఒక ఊపుఊపాయి.

Heroine bhumika chawla recalls beutiful moments of Kushi hip scene

ఈ సినిమాలో భూమిక నడుమును పవన్ చూసే సీన్ ఇప్పటికీ అభిమానులు గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ సీన్ ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ సన్నివేశం తీసేటప్పుడు భూమిక చాలా ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ సీన్ కోసం మెంటల్‌గా ప్రిపేర్ కావడానికి టైం పట్టిందని .. ఆ తర్వాత మానిటర్‌లో ఈ సీన్ చూసుకుని బాగా వచ్చిందని ఆనందపడ్డానని భూమిక తెలిపారు. సినిమా రిలీజ్ అయ్యాక నడుము సీన్‌ అందరికీ బాగా నచ్చిందని.. ఖుషి విడుదలై అప్పుడే 20 ఏళ్లు దాటిపోయిందంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X