For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ప్రవేశించారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకుని స్టార్లుగా వెలుగొందారు. ఇలా చాలా కాలం పాటు వరుస అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్‌లో హవాను చూపించిన వారిలో భూమిక చావ్లా ఒకరు. అందానికి అందం.. నటనకు నటన కనబరిచిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. దీంతో మన ఇండస్ట్రీలో చాలా కాలం పాటు తన సత్తాను చూపిస్తూ ముందుకెళ్లగలిగింది.

  Bhumika Chawla Latest Photo Shoot Goes Viral | Filmibeat Telugu

  ఇక, ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయకున్నా భూమిక చావ్లా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉండగలుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇది వైరల్ అయిపోయింది. ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

  బికినీలో రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్.. పెళ్ళయ్యాక కూడా ఎక్కడా తగ్గట్లేదుగా!

  అలా ప్రయాణం.. ఇలా ఎంట్రీ ఇచ్చేసింది

  అలా ప్రయాణం.. ఇలా ఎంట్రీ ఇచ్చేసింది

  భూమిక చావ్లా మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే ఆ రంగంలో తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. దీంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. మోడల్‌గా బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఆమెకు అన్ని ఇండస్ట్రీల నుంచి సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, అక్కినేని హీరో సుమంత్ నటించిన ‘యువకుడు' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది భూమిక చావ్లా. అయితే, ఈ చిత్రం మాత్రం ఆమెకు సక్సెస్‌ను అందించలేకపోయిందనే చెప్పాలి.

  హాట్ ఫొటోతో హీటు పెంచిన లెజెండ్ హీరోయిన్: అరాచకమైన ఫోజుతో రెచ్చిపోయిన భామ

  ఫస్ట్ హిట్ అక్కడ.. ఖుషీతో బ్రేక్ వచ్చింది

  ఫస్ట్ హిట్ అక్కడ.. ఖుషీతో బ్రేక్ వచ్చింది

  ఎన్నో ఆశలతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన భూమిక చావ్లాకు ‘యువకుడు' మూవీ నిరాశనే మిగిల్చింది. అయితేనే ఆ వెంటనే తమిళంలో విజయ్‌తో కలిసి ‘బద్రీ' అనే సినిమాను చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషీ'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. ఇక, అక్కడి నుంచి ఈ పంజాబీ ముద్దుగుమ్మ వెనుదిరిగి చూడకుండా దూసుకుని పోయింది.

  అందరితోనూ సినిమాలు... స్టార్ స్టేటస్

  అందరితోనూ సినిమాలు... స్టార్ స్టేటస్

  మిగిలిన భాషల్లో అవకాశాలు వచ్చినప్పటికీ.. భూమిక చావ్లా తెలుగులో వచ్చిన సినిమాలను ఎప్పుడూ వదులుకోలేదు. అందుకే ఆమెకు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. ఇక, సుదీర్ఘ ప్రయాణంలో ఈ పంజాబీ బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించింది. వాటిలో చాలా వరకూ విజయాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహేశ్ బాబుతో నటించిన ‘ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ‘సింహాద్రీ' చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అవి మాత్రమే కాదు.. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసన నటించిందీ క్యూట్ హీరోయిన్.

  సెక్స్ లేకుండా ఉండలేవా: శృతి హాసన్‌కు నెటిజన్ సూటి ప్రశ్న.. చీకట్లో ఉంటే అంటూ షాకింగ్ ఆన్సర్!

  క్లాసులకు వెళ్లి డేటింగ్ నడిపిన బ్యూటీ

  క్లాసులకు వెళ్లి డేటింగ్ నడిపిన బ్యూటీ

  తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, భోజ్‌పురీ, పంజాబీ ఇలా ఎన్నో భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే భూమిక చావ్లా భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో ప్రేమలో పడింది. యోగా క్లాసులకు వెళ్తోన్న సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు. అలా నాలుగేళ్ల పాటు అతడి డేటింగ్ చేసిందామె. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007 అక్టోబర్‌లో భరత్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ సమయంలోనే ఈ టాలెంటెడ్ హీరోయిన్ సినిమాకు కాస్తా దూరంగా ఉండాల్సి వచ్చింది.

   సినిమాల్లోకి రీఎంట్రీ.. ఇప్పుడూ హవా

  సినిమాల్లోకి రీఎంట్రీ.. ఇప్పుడూ హవా

  వివాహం తర్వాత భూమిక చావ్లా సినిమాలకు శాశ్వతంగా దూరం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె మాత్రం కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మంది ఆడవాళ్లుకు ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో మాదిరిగా ఇప్పుడు హీరోయిన్ ఆఫర్లు రావన్న విషయం అర్థం చేసుకున్న ఈమె.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి మిగిలిన భాషల్లో అడపాదడపా సినిమాలు చేసింది. ఇలాంటి సమయంలో నాని ‘ఎంసీఏ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ‘యూటర్న్', ‘రూరల్', ‘సవ్యసాచి' వంటి చిత్రాల్లో నటించింది.

  తెలుగు హీరోయిన్ అంజలి పర్సనల్ ఫొటోలు: గతంలో ఎన్నడూ చూడనంత హాట్ ఫోజులతో రచ్చ

  సినిమాలు చేయకున్నా అలా చేరువనే

  సినిమాలు చేయకున్నా అలా చేరువనే

  గతంలో మాదిరిగా వరుసగా సినిమాలు చేయకున్నా ఫ్యాన్స్‌తో మాత్రం నిత్యం టచ్‌లో ఉండేందుకు భూమిక చావ్లా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ వస్తోంది. ఇక, దాదాపు అన్ని సినిమాల్లో భూమిక చావ్లా సంప్రదాయమైన పాత్రల్లోనే కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ షాకిస్తోంది. ఈ ఫొటోలు చూసిన వారంతా అవాక్కైపోతున్నారు.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే భూమిక చావ్లా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ఎరుపు రంగు డ్రెస్ ధరించి ఉంది. ఇందులో తన టాప్‌ను కొంచెం కిందకు లాగిన ఈ అమ్మడు.. ఎద అందాలతో కనువిందు చేసేస్తుంది. తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా లైకులు, కామెంట్లతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood actress and a former model Bhumika Chawla Shared a Cleavage Hot Photo in her Instagram Recently. This Photo Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X