కమిట్ కాలేదు.. బయటపెడితే రచ్చే.. సీక్రెట్ యవ్వారంపై యంగ్ హీరోయిన్

ఆవకాయ బిర్యానితో సినీ రంగ ప్రవేశం చేసినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోలేకపోయిన హీరోయిన్ బిందుమాధవి మాత్రం తమిళంలో ఇరుగదీస్తున్నది. వరుస ఆఫర్లతో ఈ భామ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. దాంతో తెలుగు ప్రేక్షకుల కంటే తమిళ ఆడియెన్స్ ఆమెను సొంతం చేసుకొన్నారు. ఇటీవల తన కెరీర్ గురించి, వ్యక్తిగత జీవితానికి గురించి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకొన్నది. వివరాల్లోకి వెళితే..

 తెలుగులో ఆకట్టుకోలేకపోయి.

తెలుగులో ఆకట్టుకోలేకపోయి.

తెలుగులో బంపర్ ఆఫర్, ఓం శాంతి, రామ రామ కృష్ణ కృష్ణ, ప్రతీ రోజు లాంటి సినిమాల్లో అటు గ్లామర్ పరంగాను, యాక్టింగ్ పరంగాను తనదైన ముద్రను వేసుకొనే ప్రయత్నం చేశారు. ఆమె తెలుగులో ఈ మధ్య కనిపించిన చివరి చిత్రం పిల్లా జమిందార్. 2011 తర్వాత తెలుగులో నటించి మెప్పించిన దాఖలాలు లేవు. ఆ తర్వాత పూర్తిగా తమిళ పరిశ్రమకే పరిమితమయ్యారు.

 తమిళంలో ప్రేక్షకులకు దగ్గరై

తమిళంలో ప్రేక్షకులకు దగ్గరై

తమిళంలో కూడా అప్పుడప్పుడు తెర మీద మెరుస్తున్న తెలుగు అమ్మాయి.. తమిళ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కమల్ హోస్ట్‌గా వ్యవహరించే ఆ షోలో అందులో తనదైన శైలిలో రాణించారు. అయితే టాప్ స్థానాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం మంచి చిత్రాల కోసం ఎదురు చూస్తూ కెరీర్‌ను ప్లాన్ చేసుకొంటున్నది.

 స్వీయ గృహ నిర్బంధంలో

స్వీయ గృహ నిర్బంధంలో

ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్న బిందు మాధవి సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ జీవితం గురించి అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. తెలుగులో ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని స్పష్టం చేశారు.

ఇంకా కమిట్ కాలేదని

ఇంకా కమిట్ కాలేదని

అభిమానులతో పిచ్చాపాటి తర్వాత తన సీక్రెట్ రిలేషన్‌షిప్ గురించి చెప్పకనే చెప్పారు. నాకు ఓ సీక్రెట్ అఫైర్ ఉంది. ఇంకా కమిట్ కాలేదు అని క్లారిటీ ఇచ్చింది. అయితే తానిప్పుడే బయటకు చెప్పలేనని వెల్లడించింది. బయటకు చెప్పితే ఇక మీడియాలో రచ్చే అని పేర్కొన్నది. ప్రస్తుతానికి మాత్రం సింగిల్.. అనే సమాధానం ఇస్తానని వెల్లడించింది.

ఓ హీరోకు సన్నిహితంగా

ఓ హీరోకు సన్నిహితంగా

అయితే ఓ హీరోతో స్నేహంగా ఉంటుందని, అతడితోనే డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ వాటికి పెద్దగా ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారనే వార్త వినిపిస్తున్నది. అయితే ఆ పేరు బయటపడితే కష్టమవుతుందని, అందుకే బయటకు చెప్పడం లేదనేది సినీ వర్గాలు పేర్కొంటున్నాయి

Recommended Video

Rayalaseema Love Story Movie Press Meet
ఈ ఏడాది రెండు చిత్రాల్లో

ఈ ఏడాది రెండు చిత్రాల్లో

కెరీర్‌పరంగా పెద్దగా ప్రాజెక్టులు బిందు మాధవి చేతుల్లో లేవు. 2018లో పక్కా, 2019లో కజుగు 2 చిత్రాల్లో నటించింది. ఇక ప్రస్తుతం రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. మాయన్, యారకుమ్ అంజలే చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురు చేస్తున్నానని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X