పెళ్లి కాకుండానే తల్లి అయిన ఛార్మీ.. కానీ రెండేళ్ల క్రితమే ఆ బిడ్డ చనిపోయిందట.. అసలేం జరిగిందంటే?
ఛార్మీ.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమే. అందుకే సోషల్ మీడియా వేధికగా ఈమెను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అయితే తాజాగా ఈమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే పెళ్లి కాకుండానే ఈమె తల్లిగా మారిందని.. ఈమెకు ఒక కొడుకు ఉండగా.. రెండేళ్ల క్రితమే అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని నేరుగా ఆమే చెప్పింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ఛార్మీ కౌర్.. 2001లో నీతోడూ కావాలి అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయాన్ని చూపించి.. ఆ తర్వాత ఏడాది అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా 2002లోనే మూడు తమిళ సినిమాలతో పాటు ఒక తెలుగు చిత్రంలో అవకాశం దక్కించుకుని దుమ్మ లేపింది. ఆ తర్వాత ఏడాది నుంచి సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఇలా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది.

అయితే చివరగా సేవకుడు అనే సినిమాతో 2013లో సందడి చేసిన ఈమె ఆ తర్వాత నుంచి నటనకు దూరంగా ఉంటుంది. అయితే తన క్లోజ్ ఫ్రెండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు చాలా చిత్రాలే వచ్చాయి. కానీ అందులో హిట్లకంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ ఒక్కటి మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అయితే తాజాగా వీరిద్దరూ ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాను తీసుకురాబోతున్నారు. అయితే ఇందులో రామ్ హీరోగా చేస్తున్నాడు.
ఇదంతా ఇలా ఉండగా.. ఛార్మీకి, పూరీ జగన్నాథ్ మధ్య ఏదో సంబంధం ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. వారిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నట్లు కూడా చాలానే పుకార్లు వచ్చాయి. అయితే వీటిపై పూరీ కొడుకు ఆకాశ్ స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి వీరి గురించి అంతగా వార్తలు రావట్లేదు. కానీ తాజాగా ఛార్మీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అయితో అందులో తన కొడుకు రెండేళ్ల క్రితం చనిపోయాడని రాసుకొచ్చింది. దీంతో చాలా మంది తల్లి కాకుండా ఛార్మీ తల్లి అయిందంటూ వార్తలు రాస్తున్నారు.

అయితే ఈమె పోస్ట్ పెట్టింది తన కొడుకులా పెంచుకున్న ఓ శునకం గురించి. తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆ కుక్కపిల్ల రెండేళ్ల క్రితం చనిపోయినట్లు వివరించింది. నీ ముద్దులు, నీ హగ్గుల కావాలనిపిస్తోందని.. ఈ కోసం ఇప్పటికీ నీ తల్లి ఎదురు చూస్తుందంటూ కుక్క ఫొటోలు షేర్ చేస్తూ రాసుకొచ్చింది. అలాగే నువ్వు నా ప్రియమైన కొడుకువు.. తొందరగా మళ్లీ నా జీవితంలోకి వచ్చెయ్.. నువ్వు లేకుండా నేను పూర్తి కాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని జత చేసింది. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











