Dimple Hayathi : చెప్పలేని చోట డింపుల్ హయతి టాటూ.. అలా రెచ్చగొడుతూ..

మన బెజవాడ అమ్మాయి డింపుల్ హయాతి సినిమాల్లో వెలిగిపోవాలని అనుకున్నారు. తెలుగు చిత్ర సీమలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావన్న మాటను నిజం చేస్తూ ఈమెను టాలీవుడ్ అంతగా పట్టించుకోలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు డింపుల్. కానీ ఛాన్స్‌లు మాత్రం రావడం లేదు. తాజాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్ వేసిన ఈ డస్కీ బ్యూటీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలెంట్ ఉన్నప్పటికీ స్కిన్ టోన్ కారణంగా కొందరు అమ్మాయిలు హీరోయిన్లు కాలేకపోతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జర్రా జర్రా అనే ఐటెం సాంగ్‌లో తళుక్కున మెరిసింది డింపుల్ హయాతి. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నా ఛాన్సులు మాత్రం రాలేదు. అయితే దానికంటే ముందు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన గల్ఫ్ మూవీలో కనిపించింది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

heroine Dimple Hayathi new Tattoo actress shares it in instagram story

తొలి సినిమాలో అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో గద్దలకొండ గణేష్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది డింపుల్. కానీ ఇక్కడా సీన్ రివర్స్. అనంతరం ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన అభినేత్రి అనే మూవీలో కీ రోల్ పోషించింది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోడ్ చేసింది. తెలుగులో దేవి 2, ఏరుకలతో పాటు హిందీలో అత్రాంగి రే, తమిళ్‌లో వీరమయే వాగై సోదమ్‌లో నటించింది డింపుల్. ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన ఖిలాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇందులో బికినీతో పాటు రొమాంటిక్ సీన్స్‌లో ఇరగదీసింది. కానీ అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో డింపుల్ డీలా పడిపోయింది.

heroine Dimple Hayathi new Tattoo actress shares it in instagram story

అయితే తన కలర్ కారణంగానే తనకు అవకాశాలు రావడం లేదని పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది డింపుల్. కొందరు దర్శకులు రంగు కారణంగా తనను రిజెక్ట్ చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నామధ్య తెలంగాణకు చెందిన ఓ ఐపీఎస్ అధికారితో వివాదం డింపుల్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. పార్కింగ్ ప్లేస్‌లో ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే వాహనాన్ని ఢీకొట్టి నానా హంగామా చేసింది. ఆయన వాహనాన్ని కాలితో తన్నడం, దూషించిన ఘటనలపై పోలీసులు డింపుల్‌పై కేసు నమోదు చేశారు.

ఐపీఎస్ అధికారి వాహనాన్ని డింపుల్ పదే పదే తన్నిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలుమార్లు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె తీరు మార్చుకోలేదని సదరు అధికారి చెబుతున్నారు. దీంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి తర్వాత సద్దుమణిగింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే డింపుల్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోషూట్‌లతో సెగలు రేపుతుంటారు. తాజాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్ వేసిన డింపుల్..అక్కడ ఏనుగుతో అడుకున్నారు. అలాగే తన మోకాలు - చీల మండ మధ్యలో ఏనుగు, కలువ పువ్వులను టాటూగా వేయించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: dimple hayathi movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X