For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాత్రూంలో బోల్డుగా దిశా పటానీ సెల్ఫీ: వామ్మో అందాలు మొత్తం చూపిస్తూ ఘాటుగా!

    |

    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. నిత్యం జనాల దృష్టిలో ఉండాలన్న కోరికో.. అవకాశాల కోసం ఫిల్మ్ మేకర్లను ఆకర్షించాలన్న కారణమో తెలీదు కానీ.. చాలా మంది నటీమణులు ఇంటర్నెట్‌లో అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు. మరీ ఈ రేంజ్‌లో కాకపోయినా కొందరు మాత్రం ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా బాత్రూంలో దిగిన హాట్ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి!

     మెగా హీరోతో మొదలు పెట్టిన దిశా పటానీ

    మెగా హీరోతో మొదలు పెట్టిన దిశా పటానీ

    చదువుకునే రోజుల్లోనే కొందరి సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది దిశా పటానీ. అక్కడ తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించడంతో పాటు చాలా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో తన గ్లామర్‌తో పాటు యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. కానీ, ఈ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది.

    Evaru Meelo Koteeswarulu సెట్స్‌లో తారక్, చరణ్ ఇలా: ఇద్దరు స్టార్లూ ఒకేలా.. వాళ్ల ముఖాల్లో అది గమనించారా!

    దిశా పటానీ కెరీర్ మార్చేసిన ఎమ్మెస్ ధోనీ

    దిశా పటానీ కెరీర్ మార్చేసిన ఎమ్మెస్ ధోనీ

    దిశా పటానీ నటించిన మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ అమ్మడు సరైన బ్రేక్ అందుకోవాలని చూసింది. సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘MS Dhoni' చిత్రంలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా అనే పాత్రను పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమె కెరీర్‌ను నిలబెట్టింది. ఇందులో కనిపించేది కొద్దిసేపే అయినా.. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. తద్వారా బాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడిపోయిందీ బ్యూటీ.

     బాలీవుడ్‌లో ఫుల్ బిజీ.. అన్నింట్లోనూ రచ్చ

    బాలీవుడ్‌లో ఫుల్ బిజీ.. అన్నింట్లోనూ రచ్చ

    ‘MS Dhoni' మూవీ విజయాన్ని అందుకున్న తర్వాత దిశా పటానీకి బాలీవుడ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె వరుసగా జాకీ చాన్‌ చిత్రం ‘కుంగ్‌పూ యోగా', ‘వెల్‌కం టు న్యూయార్క్', ‘భాగీ 2', ‘భారత్', ‘మలాంగ్', ‘భాగీ 3', ‘రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటన్నింట్లోనూ తన అందచందాలతో కనువిందు చేయడంతో పాటు అద్భుతమైన నటనతో ప్రశంసలను దక్కించుకుంది. తద్వారా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. సినిమాలతో పాటు ‘బేఫికర్', ‘హర్ గూంట్ మైన్ స్వాగ్' అనే మ్యూజిక్ అల్బమ్‌లలోనూ చేసింది.

    నేను ఆ ప్రాబ్లంతో బాధ పడుతున్నా.. చెప్తే హర్ట్ అవుతారని ఆలోచించా: రోజా షాకింగ్ కామెంట్స్

    కండల వీరుడితో లవ్ ట్రాక్.. ఫుల్ ఎంజాయ్

    కండల వీరుడితో లవ్ ట్రాక్.. ఫుల్ ఎంజాయ్

    కెరీర్ పరంగా వరుస సినిమాలు చేస్తూ చాలా కాలంగా ఫుల్ ఫామ్‌లో కనిపిస్తోంది దిశా పటానీ. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఈ సుందరాంగి బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోండడమే. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

    అందులో మాత్రం ఎప్పుడూ ఫుల్ బిజీగానే

    అందులో మాత్రం ఎప్పుడూ ఫుల్ బిజీగానే

    బాలీవుడ్‌లో సినిమాల మీద సినిమాలు.. మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఒకింత ఎక్కువగానే తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తరచూ అప్‌డేట్లు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. అలాగే, తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటోందీ హీరోయిన్. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది.

    Bheemla Nayak First Glimpse: చరిత్ర సృష్టించిన పవన్.. ప్రభాస్‌ కంటే రెండితలు.. చిరు రికార్డు బద్దలు

    ఏదీ దాచుకోకుండా.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్

    ఏదీ దాచుకోకుండా.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్

    అందరిలా మామూలు అప్‌డేట్లతో ఊరుకునే బాపతు కాదు దిశా పటానీ. ఎంతో బోల్డుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో చాలా కాలంగా రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న.. వీకెండ్‌లను కలిసి జరుపుకుంటోన్న.. సీక్రెట్‌గా మీట్ అయిన వాటికి సంబంధించిన అప్‌డేట్లను కూడా ఇస్తూ తెగ హాట్ టాపిక్ అవుతోందామె. వీటి ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ పిక్స్, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో షేక్ చేస్తూ సందడి చేస్తోంది.

     బాత్రూంలో హాట్ సెల్ఫీతో దిశా పటానీ రచ్చ

    బాత్రూంలో హాట్ సెల్ఫీతో దిశా పటానీ రచ్చ

    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రూంలో అద్దం ముందర చిన్న షార్ట్, స్పోర్ట్స్‌వేర్ టాప్ ధరించి ఉంది. ఇందులో ఆమె ముఖం కనిపించడం లేదు కానీ.. మిగిలిన అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, ఘాటు ఫోజుతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అందరినీ మాయ చేసేస్తుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది. ఫలితంగా ఈ బ్యూటీ మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది.

    English summary
    Bollywood Hot Heroine Disha Patani Very Active in Social Media. Now She Shared Bathroom Hot Selfie her Instagram. This Pic Gone Viral in Internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X