మితిమీరిన మెగా హీరోయిన్ గ్లామర్ డోస్: టూపీస్ బికినీలో అందాల విందు.. మరీ ఈ రేంజ్‌లోనా!

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. నిత్యం ఫ్యాన్స్‌కు మజాను పంచుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తమ అందచందాలను నెటిజన్ల అరచేతిలోనే పెట్టేస్తున్నారు. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు. సినిమాలను పక్కన పెడితే తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ తాజాగా ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. అది చాలా తక్కువ టైమ్‌లోనే వైరల్ అయిపోయింది. ఆ వివరాలు మీకోసం!

తెలుగులోనే పరిచయమైన హీరోయిన్

తెలుగులోనే పరిచయమైన హీరోయిన్

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో తన గ్లామర్‌తో పాటు యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. కానీ, ఈ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది.

ఆమె జీవితాన్ని మార్చిన ఎంఎస్ ధోని

ఆమె జీవితాన్ని మార్చిన ఎంఎస్ ధోని

మొదటి సినిమానే పరాజయం పాలవడంతో దిశా పటానీ టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న సమయంలోనే 'ఎమ్ఎస్ ధోనీ' చిత్రం ఆమె కెరీర్‌ను నిలబెట్టింది. ధోనీ బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమాలో ప్రియాంక ఝా అనే పాత్రను పోషించిందామె. ఇందులో కనిపించేది కొద్దిసేపే అయినా.. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.

అన్నింట్లోనూ ఉంటూ బిజీ అయిందిగా

అన్నింట్లోనూ ఉంటూ బిజీ అయిందిగా

'MS Dhoni' మూవీ తర్వాత దిశా పటానీ వరుస ఆఫర్లను అందుకుంటూ ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే ఆమె వరుసగా జాకీ చాన్‌ చిత్రం 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటితో పాటు 'బేఫికర్', 'హర్ గూంట్ మైన్ స్వాగ్' అనే మ్యూజిక్ అల్బమ్‌లలోనూ చేసింది. ఇలా ఫుల్ బిజీ అయింది.

యాక్షన్ హీరోతో దిశా పటానీ లవ్ ట్రాక్

యాక్షన్ హీరోతో దిశా పటానీ లవ్ ట్రాక్

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ దిశా పటానీ తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ ఇద్దరూ.. ఈ మధ్య బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతున్నారు.

ఎప్పుడూ అందులోనే ఉంటోన్న భామ

ఎప్పుడూ అందులోనే ఉంటోన్న భామ

సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఎన్నో గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. అలాగే, తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోందీ హీరోయిన్.

అలాంటి విషయాలు.. గ్లామర్ ట్రీట్‌ రచ్చ

అలాంటి విషయాలు.. గ్లామర్ ట్రీట్‌ రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ చేసే దిశా పటానీ.. తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంది. వీకెండ్‌లను కలిసి జరుపుకోవడం.. సీక్రెట్ మీటింగులు పెట్టుకోవడం వంటి వాటితో తెగ హాట్ టాపిక్ అవుతోందామె. వీటి ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. అలాగే తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఓ ఊపు ఊపుతోంది.

టూపీస్ బికినీలో దిశా అందాల విందు

టూపీస్ బికినీలో దిశా అందాల విందు

దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె సముద్రపు అలల మధ్యన టూపీస్ బికినీ ధరించి ఉంది. ఇందులో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, తడిచిన దేహంతో దిశా మాయ చేసేస్తుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X