అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్లు సినిమాలు చేయకున్నా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. అందులో కొందరైతే శృతి మించిన గ్లామర్ ట్రీట్‌తో మస్తు మజాను పంచుతున్నారు. తద్వారా నిత్యం వార్తల్లో ఉంటూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన ఈ బ్యూటీ.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.

అదే సమయంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ అరాచకమైన డ్రెస్‌తో దిగిన హాట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన ప్రయాణం.. తెలుగులోనే

అలా మొదలైన ప్రయాణం.. తెలుగులోనే

చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది దిశా పటానీ. అక్కడ తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించడంతో పాటు చాలా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో తన గ్లామర్‌తో పాటు యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. కానీ, ఈ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత టాలీవుడ్‌ మరో సినిమాను ఒప్పుకోలేదు.

దిశా పటానీ జీవితాన్ని మార్చేసిన సినిమా

దిశా పటానీ జీవితాన్ని మార్చేసిన సినిమా

మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో దిశా పటానీ సరైన బ్రేక్ అందుకోవాలని చూసింది. సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా అనే పాత్రను పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమె కెరీర్‌ను నిలబెట్టింది. ఇందులో కనిపించేది కొద్దిసేపే అయినా.. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. తద్వారా బాలీవుడ్‌లో ఫుల్ ఫోకస్ అయిపోయిందీ బ్యూటీ.

స్టార్ హీరోయిన్... వరుస సినిమాలతో బిజీ

స్టార్ హీరోయిన్... వరుస సినిమాలతో బిజీ

'MS Dhoni' తర్వాత దిశా పటానీకి బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటన్నింట్లోనూ తన అందచందాలతో కనువిందు చేయడంతో పాటు అద్భుతమైన నటనతో ప్రశంసలను దక్కించుకుంది. తద్వారా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. సినిమాలతో పాటు 'బేఫికర్', 'హర్ గూంట్ మైన్ స్వాగ్' అనే మ్యూజిక్ అల్బమ్‌లలోనూ కనిపించి సత్తా చాటింది.

స్టార్ హీరోతో డేటింగ్.. ఎప్పుడూ వార్తల్లోనే

స్టార్ హీరోతో డేటింగ్.. ఎప్పుడూ వార్తల్లోనే

స్టార్ హోదాలో వరుస సినిమాలు చేస్తూ చాలా కాలంగా ఫుల్ ఫామ్‌లో కనిపిస్తోంది దిశా పటానీ. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఈ సుందరాంగి బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోండడమే. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ రచ్చ చేస్తూనే

అక్కడ మాత్రం ఎప్పుడూ రచ్చ చేస్తూనే

సినిమాల మీద సినిమాలు.. మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఒకింత ఎక్కువగానే తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తరచూ అప్‌డేట్లు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. అలాగే, తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటోందీ హీరోయిన్. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఓ రేంజ్‌లో పెరుగుతోంది.

అందాల విందు.. ఎప్పుడూ హాట్ టాపిక్

అందాల విందు.. ఎప్పుడూ హాట్ టాపిక్

దిశా పటానీ అందరిలా మామూలు అప్‌డేట్లను ఇచ్చే సెలెబ్రిటీ కాదు. ఎంతో బోల్డుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో చాలా కాలంగా రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న.. వీకెండ్‌లను కలిసి జరుపుకుంటోన్న.. సీక్రెట్‌గా మీట్ అయిన వాటికి సంబంధించిన అప్‌డేట్లను కూడా ఇస్తూ తెగ హాట్ టాపిక్ అవుతోందామె. వీటి ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ పిక్స్, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో షేక్ చేస్తూ సెగలు రేపుతోంది.

Recommended Video

Victory Venkatesh Launched Poni Poni Song From Natyam Movie
అరాచకమైన డ్రెస్‌లో మొత్తం చూపిస్తూ

అరాచకమైన డ్రెస్‌లో మొత్తం చూపిస్తూ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె నలుపు రంగు అరాచకమైన డ్రెస్‌ను ధరించి ఉంది. ఇందులో ఆమె అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, ఘాటు ఫోజుతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అందరినీ మాయ చేసేస్తుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఎవరూ ఊహించని రీతిలో స్పందన వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. ఫలితంగా ఈ బ్యూటీ మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X