Ester Noronha సింగర్ నోయల్‌తో విడాకులు.. అసలు కారణాలు బయటపెట్టిన హీరోయిన్ ఎస్తర్

టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టింది ఎస్తర్ నోరోన్హా. ఈ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రముఖ సింగర్, ర్యాపర్, బిగ్ బాస్ ఫేం నోయల్ ను పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏమైందో తెలియదు ఏడాదిలోపే వీళ్లు విడిపోయారు. అయితే తాజాగా ఈ భామ మాయ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

షాకిచ్చిన జంట
హీరోయిన్ ఎస్తర్ నోరోన్హా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ 'భీమవరం బుల్లోడు', 'గరం', 'జయ జానకి నాయక' లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి పలు సినిమాల్లో నటించింది. అదే సమయంలో ప్రముఖ సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంట ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయింది. పెళ్లైన ఏడాదిలోపే విడాకులు తీసుకుని ఫ్యాన్స్ కు షాకిచ్చారు.

Heroine Ester Noronha Reveals Why She Divorced Bigg Boss Fame Singer Noel Full Details Here

ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
ఇక తాజాగా ఎస్తర్ మాయ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు మార్చి 15న వచ్చింది. రమేష్ నాని ఈ సినిమాకి దర్శకత్వం వహించగా... రాజేష్ నిర్మాతగా వ్యవహారించారు. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ క్రమంలోనే తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్వూ ఇచ్చింది.

శాక్రిఫైజ్ ప్రేమ కాదు....
ఆ ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా సింగర్ నోయల్ తో విడాకుల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. మీరు విడాకులు ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్నకు ఎస్తర్ మాట్లాడుతూ... ''ఒక్కరి తప్పు అని చెప్పను. రెండు వైపుల తప్పు ఉంటుంది. ప్రేమ ఉంటే.. నీ కోసమే చేస్తున్నా.. శాక్రిఫైజ్ చేస్తున్నా... అనే ఫిలింగ్ రాదు. ప్రేముంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా.. ఏదైనా భరిస్తాం.. కానీ ప్రేమ లేకపోతే.. అది శాక్రిఫైజ్ లాగా ఫీల్ అవుతారు. బయట ఎన్ని ఉన్నా.. ఇలాంటివి మ్యాచ్ లేకపోతే.. ఆ బంధం ఎక్కువ కాలం నిలువదు. అందుకే విడిపోయాం అంటూ వెల్లడించింది.

Heroine Ester Noronha Reveals Why She Divorced Bigg Boss Fame Singer Noel Full Details Here

అలాంటి వ్యక్తి కాబట్టే...
మరి విడాకుల విషయంలో మీ పేరెంట్స్ మిమ్మల్ని కలిసి ఉండమని కన్విన్స్ చేశారా అని అడగ్గా... దానికి ఎస్తర్ మాట్లాడుతూ... ''మారే మనుషులు అయితే క్షమించి బతుకొచ్చు.. కానీ తెలిసి కొంత మంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. వారితో ఉండలేం. ఇవన్నీ చెప్పకూడని విషయాలు. నాకు ఏం కాదు.. కానీ వేరే వ్యక్తి విషయం ఇది. ఆ మనిషి గురించి బయటపడుతుంది. నేను ఆ వ్యక్తిని దగ్గర నుంచి చూశాను. దూరం నుంచి చూసే వాళ్లకు ఇది అర్థం కాదు. పైకి మంచిగా కనిపించినా.. కలిసి జీవించే వారికే ఇంకో నిజం తెలుస్తోంది. నేను చెప్పడం ఎందుకు.. చాలా మందికి ఈ విషయం తెలుసు'' అంటూ చెప్పుకువచ్చింది.

మళ్లీ పెళ్లి చేసుకుంటా...
విడాకుల తర్వాత మీరు మాట్లాడుకుంటున్నారా అని అడిగితే.. దానికి ఎస్తర్ ఎప్పుడూ లేదని వెల్లడించింది. మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా.. కచ్చితంగా చేసుకుంటాను. ప్రేమ మీద, పెళ్లి మీద ఇంకా నమ్మకం ఉంది. అర్థం చేసుకునే వ్యక్తి వస్తే.. ప్రేమ పెళ్లి కూడా చేసుకుంటాను అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X