ఘాటు సెల్ఫీతో హీటు పెంచుతోన్న ఇలియానా: క్లోజప్ షాట్‌లో కేక పుట్టించే ఫోజు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా ఎదుగుతారు. అలాంటి వారిలో గోవా చిన్నది ఇలియానా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో చాలా కాలం పాటు హవాను చూపించిందామె. ఈ క్రమంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇలా తనదైన శైలిలో మెప్పిస్తూ దూసుకెళ్లిన ఈ బ్యూటీ.. కొంత కాలంగా ఖాళీగానే ఉంటోంది.
అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇలియానా బికినీతో దిగిన ఓ హాట్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఫిదా చేసిన ఇలియానా
చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. అక్కడ పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో సత్తా చాటుతోన్న సమయంలోనే ఈమె 'దేవదాసు' అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంది.
ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. అదే సమయంలో భారీగా రెమ్యూనరేషన్ కూడా అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది.

తెలుగులో ఫేడవుట్... అక్కడ ఆఫర్లతో
చాలా కాలం పాటు టాలీవుడ్‌లో తన మార్కు చూపించిన ఇలియానా.. కొన్నాళ్లకు తెలుగులో వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇక్కడ సినిమాలు తగ్గించేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత హిందీలో అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే గ్యాప్ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా దారుణ పరాజయం పాలవడంతో తెలుగు పరిశ్రమలో కనిపించకుండా వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె మరో సినిమా చేయలేదు.

అతడితో ప్రేమాయణం.. బ్రేకప్ చేసుకుని
చేతి నిండా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది.
ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. కొద్ది రోజుల్లో అతడితో వివాహం చేసుకుంటుంది అన్న సమయంలో వీళ్లిద్దరికీ చెడింది. దీంతో కొన్నేళ్ల తర్వాత ఇలియానా అతడికి బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్నట్లు స్వయంగా చెప్పింది.

డిప్రెషన్‌లో ఇలియానా... ఎన్నో పుకార్లు
ఎంతగానో ప్రేమించిన ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు ఆమె కెరీర్ పరంగా గాడి తప్పడంతో పాటు ఫిజిక్‌ను కూడా పోగొట్టుకుంది. అదే సమయంలో ఈమె ఆత్మహత్యకు యత్నించినట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇక, ఇది జరిగిన తర్వాత కొన్నేళ్లకు తేరుకున్న ఈ భామ.. ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తూ బిజీగా గడిపింది. దీంతో మునుపటి రూపానికి వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లోనూ నటిస్తూ బిజీ అయిపోయిందీ బ్యూటీ.

అందులో మాత్రం ఇలియానా ఫుల్ బిజీ
గతంలో మాదిరిగా వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది.
అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన అందాలతో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్లు కూడా పెరుగుతున్నారు. అదే సమయంలో పలుమార్లు ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ కూడా అవుతోంది.

అందాల విందు చేస్తూ.. రెచ్చిపోతోందిగా
ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయని ఇలియానా గోవాలోనే నివాసం ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ అక్కడి బీచ్‌లలో దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది.

బికినీ సెల్ఫీతో హీటు పెంచేసిన ఇలియానా
సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉండే ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గోవా బీచ్‌లో దిగిన హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె మేకప్ లేకుండా కనిపించింది. కళ్లకు నల్ల అద్దాలను పెట్టుకుని స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. అంతేకాదు, బికినీ ధరించి ఎద అందాలు కనిపించేలా ఫోజులిచ్చింది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా అప్పుడే కొన్ని లక్షల లైకులు వచ్చాయి. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











