బెడ్‌పై అర్ధనగ్నంగా ఇలియానా రచ్చ: వామ్మో అదొక్కటి అడ్డు లేకుంటే అంతే సంగతులు
ఆకట్టుకునే అందం.. పర్‌ఫెక్ట్ ఫిగర్.. ఫిదా చేయగల నటన ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది గోవా చిన్నది ఇలియానా. 'దేవదాసు' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో చాలా కాలం పాటు హవాను చూపించింది.
ఈ క్రమంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే, ఈ మధ్య పెద్ద సినిమాలు చేయడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇలియానా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం.. టాలీవుడ్‌లో రికార్డు
మోడలింగ్‌లో సత్తా చాటుతోన్న సమయంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆరంభంలోనే అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించింది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. అలాగే రెమ్యూనరేషన్‌తో రికార్డు క్రియేట్ చేసింది.

తెలుగులో నిరాశ.. అటు వైపు వెళ్లింది
సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తన మార్కు చూపించిన ఇలియానా.. కొన్నాళ్లు వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇక్కడ సినిమాలు తగ్గించేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే గ్యాప్ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

విదేశీయుడితో డేటింగ్... బ్రేకప్ చెప్పి
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. కొన్నాళ్లకు అతడికి ఇలియానా బ్రేకప్ చెప్పేసింది.

బ్రేకప్ తర్వాత డిప్రెషన్.. ఆత్మహత్య
ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు ఆమె కెరీర్ పరంగా గాడి తప్పడంతో పాటు ఫిజిక్‌ను కూడా పోగొట్టుకుంది. అదే సమయంలో ఈమె ఆత్మహత్యకు యత్నించినట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇక, ఇది జరిగిన తర్వాత కొన్నేళ్లకు తేరుకున్న ఈ భామ.. ఆఫర్ల కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

అక్కడ ఇలియానా ఎప్పుడూ బిజీగానే
వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన అందాలతో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తోంది.

అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోందిగా
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న ఇలియానా ఈ మధ్య అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

బెడ్‌పై అర్ధనగ్నంగా కనిపించిన భామ
గోవా బ్యూటీ ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌పై పడుకుని ఒంటిపై బట్టలు లేకుండా కనిపించింది. అయితే, బ్లాంకెట్ కప్పుకుని అందాలను కవర్ చేసుకుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











