Ileana D'Cruz: ఇలియానా బిడ్డకు తండ్రి అతడేనట.. తొలిసారిగా భర్త ఫొటో షేర్ చేసిన హీరోయిన్!
దేవదాసు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ కరెంటు తీగ.. ఆ తర్వాత అద్భుమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్ స్టార్ అండ్ యంగ్ హీరోల అందరి సరనస నటించిన ఈ ముద్దుగమ్మ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే చివరగా మాస్ మహారాజా రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ.. మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అయితే టాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది.
అక్కడ కూడా అంతగా గుర్తింపు రాకపోవడంతో మెల్లి మెల్లిగా సినిమాలు చేయడం తగ్గించేసింది. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఎప్పుడూ ఫుల్ బిజీగానే ఉంటూ తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది. కొంత కాలం క్రితం తాను తల్లిని కాబోతున్నట్లు తెలిపి అందరికీ షాకిచ్చింది. షాక్ ఎందుకంటే ఆమెతో ఎవరితోనూ ప్రేమలో పడినట్లు కానీ, పెళ్లి చేసుకున్నట్లు కానీ చెప్పలేదు. నేరుగా బేబీ బంప్ ఫొటోలతో పాటు ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి తాను ఓ పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.

అయితే ఇంత కాలం పాటు ఆ బాబుకు తండ్రి ఎవరు అన్నది, తన భర్త ఎవరు అన్నది చెప్పలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆమె గర్భానికి కారణం ఎవరైనా స్పెర్మ్ దానం చేయడమేమో అనుకున్నారు. కానీ తాజాగా ఇలియానా చేసిన పోస్ట్ తో వీటన్నిటికీ సమాధానం దొరికింది. తొలి సారిగా ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరన్నది చెప్పింది. అతడి పేరు చెప్పకుండా నేరుగా ఆయన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడిచింది.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తన కొడుకుతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఈక్రమంలోనే ఇన్ స్టా వేదికగా ఆమెను నెటిజెన్లు కొన్ని ప్రశ్నలు అడిగారు. అందుకు ఆమె సమాధానాలు కూడా ఇచ్చారు. ఓ నెటిజెన్.. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అనగా.. సరిగ్గా ఏడాది క్రితం తాను గర్భం దాల్చినట్లు చెప్పింది. తల్లి కాబోతున్నట్లు తెలిసనప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయానని వివరించింది. అలాగే బాబు పుట్టగానే అతడిని హత్తుకున్న క్షణాలను మాటల్లో వర్ణించలేనంటూ తల్లిప్రేమను తెలిపింది.

డెలివరీ సమయంలో మీతో ఎవరున్నారన్న ప్రశ్నకు తన తల్లి తన వెంట ఉందని చెప్పింది. గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డ పుట్టే వరకు ఆమె తల్లి ఇలియానాతోనే ఉందని వివరించింది. అలాగే సింగిల్ పేరెంట్ గా బేబీని ఎలా పెంచగలుగుతున్నారని వచ్చిన ప్రశ్నకు.. నేను సింగిల్ పేరెంట్ కాదంటూ తన భర్త ఫొటోను షేర్ చేసింది. అతడే తన బిడ్డకు తండ్రి అని ఇద్దరూ కలిసే బాబును పెంచుతున్నట్లు వెల్లడించింది. అలాగే తన భర్త విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నాని.. త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇలియానా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











