ఒంటరిగా రమ్మన్నారు... డర్టీ టచ్ గురించి ఓపెన్ అయిన హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడు వివాదాస్పద అంశమే. ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎన్నో షాపింగ్ సంఘటనలు వెలుగులోకి రాగా, తాజాగా మరో హీరోయిన్ తనకు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎదురైనా చేదు అనుభవాలను బయట పెట్టింది. ఓ స్టార్ హీరో తనని రూముకు రమ్మన్నాడు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరు ? ఆమెకు ఎదురైనా చేదు అనుభవాలు ఏంటో? ఓ లుక్కేద్దాం పదండి.
ఈ సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్ పేరు ఇషా కొప్పికర్. సౌత్ తో పాటు నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కెరీర్ మొదట్లో తనకు కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి షాకింగ్ అనుభవం ఎదురయిందని చెప్పుకొచ్చింది. 18 ఏళ్ల వయసులోనే తను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని, అయితే అప్పట్లో ఓ స్టార్ హీరో తనను రూముకు రమ్మన్నాడు అంటూ బాంబు పేల్చింది.

ఆ స్టార్ హీరో పేరు అయితే చెప్పలేదు గాని ఓ ఏ లిస్ట్ హీరో తనని రూముకి రమ్మంటూ డ్రైవర్ ను ఏకంగా ఇంటికి పంపాడట. అయితే అతను అప్పటికే చాలా వివాదాలలో ఇరుక్కోవడం, హీరోయిన్లతో ఎఫైర్ గురించిన వార్తలు బయటకు రావడంతో ఈ విషయం గురించి బయట ఎక్కడా చెప్పొద్దని రిక్వెస్ట్ చేశారట. కానీ తాను ఒంటరిగా రాలేనని చెప్పి ఆ డ్రైవర్ని తిరిగి పంపించేసిందట ఇషా.
సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా వెలగాలి అంటే హీరోలతో స్నేహంగా మెలగాలి అని చెప్పేవారట. స్నేహంగా అంటే నేను అందరితోను స్నేహంగానే ఉంటాను, వాళ్ళు చెప్పే స్నేహానికి అర్థం ఏమిటో తెలియలేదని అప్పట్లో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు గుర్తు చేసుకుంది. అంతేకాకుండా నటీనటులు లేదా డైరెక్టర్ అసిస్టెంట్స్ అనుచితంగా తాకేవారని చెప్పింది. ఇక హీరోలతో స్నేహంగా మెలగాలని, డర్టీగా టచ్ చేయాలని కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఇలాంటి సంఘటనల వల్లే అప్పట్లో హీరోయిన్లుగా ఎదగాలని కలలుగన్న నటీమణులు ఇండస్ట్రిని వదిలి పెట్టారని, కొంతమంది మాత్రమే ఇలాంటి పరిస్థితులను దాటుకొని ఇంకా ఇక్కడ బతుకున్నారని చెప్పింది. అన్నింటినీ దాటుకొని ఇక్కడిదాకా వచ్చిన అతికొద్ది మందిలో తాను కూడా ఒకదానిని అంటూ ఇండస్ట్రిలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో వివరించింది ఇషా.
కాగా ఇషా కొప్పికర్ తెలుగులో రెండు మూడు సినిమాలలో నటించడంతో ఆమె టాలీవుడ్ మూవీ లవర్స్ కు కూడా సుపరిచితురాలే. ఇషా తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ లాంటి సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ హిందీ హీరోయిన్ అయినప్పటికీ ఒక్క తెలుగులోనే కాదు కన్నడ, తమిళ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. దీంతో సౌత్ నుంచి నార్త్ దాకా భాషతో సంబంధం లేకుండా ఇషా అన్నీ వుడ్స్ మూవీ లవర్స్ కు బాగా పరిచయమున్న నటి అన్పించుకుంటోంది.


Click it and Unblock the Notifications











