Janhvi Kapoor: మీరు గర్వపడేలా కష్టపడతా..! మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు..జాన్వీ కపూర్ భావోద్వేగం

Devara pre release event: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. సన్సెషల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదలవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ లాగానే ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. అటు అడ్వాన్స్ బుకింగ్ లో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 22న చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని మేకర్స్‌ భావించి ఏర్పాట్లు చేశారు. కానీ ఆ ఈవెంట్ రద్దు అయింది. ఈ క్రమంలో దేవర మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ ఓ ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. నెట్టింట్లో వైరలయినా ఈ వీడియో జాను పాప ఏం మాట్లాడిందో మీరు కూడా ఓ లూక్కేయండి.

'దేవర' మూవీ టీం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని భావించారు. హైదరాబాద్‎లోని నోవాటెల్ హోటల్‎లో ఆదివారం (సెప్టెంబర్ 22న) మేకర్స్‌ ఏర్పాట్లు చేశారు. కానీ, పరిమితికి మించి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో సెక్యూరిటీ చేతులేత్తేసింది.దీంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జనరల్‌ పాసులు వాళ్లు వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి వెళ్లడంతో ఓ రెంజ్ లో తోపులాట జరిగింది. దీంతో ఈ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా డిస్సపాయింట్ అయ్యారు. ఈ కమంలో తనకు ఎంతో బాధ కలిగిందంటూ.. ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్‌.

Heroine Janhvi Kapoor shared an emotional video on about Devara pre-release event was cancelled

దేవర ప్రీ రిలీజ్‌ వేడుక రద్దు కావడంపై హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ.. 'అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి, నాపై ఇంత ప్రేమను చూపిస్తున్న తెలుగు ఆడియన్స్ కు ధ్యాంక్స్‌. నన్ను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్‌ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యావాదాలు. మీరు నన్ను సొంత మనిషిలా భావించడం నాకు చాలాగా సంతోషంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు.

మా అమ్మకు, నాకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. నన్ను ఇంతలా సపోర్ట్‌ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. 'దేవర' నా తొలి అడుగు. శివ సార్, ఎన్టీఆర్‌ సార్..నన్ను ఈ ఫిల్మ్ కు ఎంపిక చేయడం నా అదృష్టం. మా ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్‌ చేసినందుకు దేవర టీమ్‌ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ ఓ వీడియో తన 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేశారు జాను పాప.

అంతే కాదు.. తాను ఈ మాటలు స్వయంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పాలనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తానంటూ రాసుకొచ్చింది దేవర హీరోయిన్ జాన్వీ కపూర్. నెట్టింట్లో వైరలవుతున్నా ఈ వీడియో జాన్వీ కపూర్ లంగా ఓణీ కట్టుకొని అచ్చ తెలుగులా కనిపిస్తుంది. ఓ హిందీ అమ్మాయి అయి కూడా తెలుగును చాలా చక్కగా మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో ఆమెపై ప్రశంసలు కురుపిస్తూ.. జానీ పాప సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్ తెలుగులో నటించిన మూవీ ఇదే దేవర. ఈ మూవీలో ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. దేవర మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నార. ఈ చిత్రంలో సైఫ్ అలీఖన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ కె, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ మూవీని సెప్టెంబరు 27 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

More from Filmibeat

Read more about: janhvi kapoor devara ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X