Janhvi Kapoor బంగారం పూత డ్రస్సులో మరింత హాట్‌గా.. అందంతో అదరగొట్టిన శ్రీదేవి కూతురు
ఇండియన్ సినిమా గర్వించదగిన హీరోయిన్, స్వర్గీయ శ్రీదేవి నటవారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తన సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకొంటున్నది. అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న ఈ యువ సుందరి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకొంటున్నారు. అయితే తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో ఎంత హాట్‌గా కనిపిస్తుందో మీరే చూడండి...

శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లోకి
బోని కపూర్, శ్రీదేవి సినీ వారసత్వంతో ధడక్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికి ఆమెకు నిరాశే మిగిలింది. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నది. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా ఆమె కెరీర్ టేకాఫ్ కావడానికి కాస్త ఆలస్యం అవుతున్నది.

విదేశీ టూర్లు, బీచుల్లో వెకేషన్
ఇక సినిమా జీవితాన్ని పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితాన్ని జాన్వీకపూర్ సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్లతో వెకేషన్ ప్లాన్ చేసుకొంటూ కనిపిస్తుంటారు. విదేశీ టూర్లలో బీచ్‌ల వెంబడి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్‌ను పంచుతుంది.

బంగారం పూత డ్రస్సులో మెరిసిన జాన్వీ
జాన్వీ కపూర్ తన అంద చందాలతో డిసెంబర్ 14వ తేదీన ఇంటర్నెట్ మీడియాను హీటెక్కించింది. బంగారు పూతతో కూడిన డ్రస్సులో అందాలను ఆరబోశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాన్వీ కపూర్ తన ఎద అందాలను అభిమానులతో పంచుకొన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లోను, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో కూడా వైరల్ అవుతున్నాయి.

జాన్వీ కపూర్ ఫోటోలకు భారీగా లైకులు
జాన్వీకపూర్ షేర్ చేసిన తాజా ఫోటోలతో ఈ ముద్దుగుమ్మ మరింత ఫిట్‌గా కనిపించింది. అలాగే ఆమె పెట్టిన డ్యాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకొంటున్నాయి. చాలా అందంగా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జాన్వీ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 7 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషంగా మారింది.

జాన్వీ కపూర్ సినీ కెరీర్ ఇలా..
జాన్వీ కపూర్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన చివరి చిత్రం రూహి. వరుణ్ శర్మ, రాజ్ కుమార్ రావు నటించిన ఈ చిత్రానికి విజన్, ఎంఎస్ లాంబా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో గుడ్ లక్ జెర్రీ, కరణ్ జోహర్ దర్శకత్వంలో దోస్తానా 2, అలాగే తఖ్త్ 2, చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టుల చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











