Balakrishna Kajal: బాలయ్యపై కాజల్ హాట్ కామెంట్స్... ఆయన నేనొక్కటే అంటూ...!
దసరాకు రిలీజ్ అయ్యే సినిమాల్లో బాలయ్య భగవంత్ కేసరి ఒకటి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో... ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ లాంఛ్ ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంటులో ట్రైలర్ రిలీజ్ చేయగా.. బాలయ్య డైలాగులు, ట్రైలర్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్... సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక అందులో కాజల్ ఆగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాదు.. నేను బాలయ్య ఒకటే అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక ఈ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్.. బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. కాజల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. ఈ సినిమా అందరికి నచ్చుతుందని చెప్పుకువచ్చింది. బాలయ్య సార్ తో వర్క్ చాలా బాగుంది.. ఎనర్టిటిక్ పర్సన్.. సింపుల్ నైస్ పర్సన్ అంటూ చెప్పుకువచ్చింది.

ఇక ఈ సినిమాలో కాత్యాయని పాత్రలో కాజల్ నటిస్తుంది. ఇక ఈ పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ పాత్రలో హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో నా పాత్ర సైకోలాజిస్ట్. కామెడీ టైమింగ్ ఉంటుంది. ఈ రోల్ నాకు నచ్చింది. ఇక షూటింగ్ బ్రేక్ టైంలో నేను చాలా బిజీగా ఉంటాను. నా బేబీతో టైం గడిపేదాన్ని. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుతూ... వర్సటైల్ డైరెక్టర్... ఆయన సినిమాల్లో కామెడీ, యాక్షన్... ఉంటుంది. ఈ సినిమాల్లో అన్ని ఉన్నాయి. ఈ కథ నాకు బాగా నచ్చిందంటూ వెల్లడించింది.
ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలయ్య ఆఫ్ సెట్స్ వెరీ ఫన్నీగా ఉండే వారు. ఆయన నిజాయితీగా ఉంటారు. ఏం ఉంటే అదే చెప్తాడు. ఆయనలో షేడ్స్ చూడలేదు. ఇక ఆయన ఆఫ్ సెట్స్ లో ఉండే విధానం చూస్తే.. నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన అందరితో చాలా బాగుంటారు. ఆయన ఒక్కటే అంటూ కామెంట్స్ చేసింది.

ఇక ఈ సినిమాలో నేను నటించడం బాగా ఎంజాయ్ చేశాను. అందరూ సపోర్టివ్ ఉన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చెప్పుకువచ్చింది. ఇక నేటితరం హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ.. పర్సనల్ గ్రోత్ ఇంపార్టెంట్... సినిమా కంటే.. అంటూ చెప్పుకు వచ్చింది. ఇక భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కే కాదు.. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఇందులోని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయంటూ చెప్పుకువచ్చింది.
ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో శ్రీలీల.. బాలయ్య కూతురిగా నటిస్తుంది. ఇక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మునుపెన్నడూ చూడని అవతార్ లో బాలయ్య కనిపిస్తాడని మేకర్స్ చెబుతున్నారు. మరి రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











