Kajal Aggarwal: భర్తకి లిప్ లాక్స్ ఇస్తూ రెచ్చిపోయిన కాజల్... ఇలా చేస్తే కుర్రాళ్లు ఏమవ్వాలి?

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక పెళ్లి ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ఇటు సినిమాలు.. అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఇక తాజాగా కాజల్ చేసిన పనికి కుర్రాళ్లు హర్ట్ అయినట్లు తెలుస్తోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో భర్త గౌతమ్ కిచ్లూని ముద్దుల్లో ముంచేత్తించింది. దీనితో అభిమానులు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు కాజల్. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలతో ఆకట్టుకుంటుంది ఈ చందమామ. లక్ష్మీ కల్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కుర్రాళ్ల చందమామగా తన అందాలతో, తన పెర్ఫామెన్స్ తో అలరిస్తూ వస్తుంది. ఇక ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో పలకరించింది.

 Heroine Kajal Aggarwal Liplock To Her Husband Gautam Kitchlu Photos Goes Viral

కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆ మధ్య ఈ దంపతులు నీల్ కిచ్లు అనే బేబీకి జన్మనిచ్చారు. గౌతమ్ కిచ్లూ.. కాజల్ స్నేహితుడే. ఇక కుటుంబ బాధ్యతలను, అటు సినిమాలను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది కాజల్. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది ఈ భామ.

ఎప్పటికప్పుడు తన విషయాలను, తన ఫోటోలను వీడియోలు నెటిజన్లతో పంచుకుంటుంది. కాజల్ ఆగర్వాల్ ఇచ్చే అప్డేట్స్ కోసం.. ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో కాజల్ తన న్యూ ఇయర్ 2024 కు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది ఈ భామ. తన భర్త గౌతమ్ కిచ్లు, కొడుకు నీల్ కిచ్లు, ఫ్రెండ్స్ తో కలిసి కొత్త సంవత్సరపు వేడుకను సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

పెళ్లి తర్వాత పద్దతిగా కనిపిస్తూ వచ్చిన కాజల్ అగర్వాల్ ఒక్క ఫోటోతో ఫ్యాన్స్ గుండెల్లో బాంబ్ పేల్చింది. తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ కు కలల రాణి కాజల్ అగర్వాల్. అలాంటి ఆమె తన భర్తను ముద్దులతో ముంచేత్తింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకుంది. కాజల్ తన భర్తకు లిప్ లాక్ ఇచ్చిన ఫొటోను పంచుకోవడంతో ఫ్యాన్స్, కుర్రాళ్లు ఫీల్ అవుతున్నారు.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అవి చూసిన నెటిజన్స్... గుండెను కోశావ్ కాజు అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం భర్తతో రొమాంటిక్ స్టిల్స్ బాగున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం కాజల్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'సత్యభామ', 'ఉమా' కాకుండా... కమల్ హాసన్ సరసన 'ఇండియన్2'లో నటిస్తుంది. ఇక ఈ ఏడాది ఈ భామకు కీలకమని తెలుస్తోంది. ఆమె ఆశలు ఈ సినిమాలపై ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X