Kajal Aggarwal: కిల్లింగ్ షోతో కవ్విస్తున్న కాజల్.. తల్లైనా తర్వాత కూడా ఇలానా!
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది చందమామ కాజల్ అగర్వాల్. దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు పరిశ్రమలో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ చిన్నది..
ఇప్పటికి కూడా ఎన్నో అవకాశాలను దక్కించుకుంటోంది. ఫలితంగా చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక, తాజాగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

నేషనల్ రేంజ్‌కు వెళ్లింది: కాజల్ అగర్వాల్ 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతోనే కెరీర్ మొదలెట్టిన విషయం తెలిసిందే. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్‌లో సైతం కాజల్ కొన్ని చిత్రాలను చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును పొందింది.

తల్లైన కాజల్.. గ్యాప్ ఇచ్చి: ఏకధాటిగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తతో రహస్యంగా లవ్ ట్రాక్ నడిపించింది. ఇది రివీల్ అయిన కొద్ది రోజులకే అతడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేసిన కాజల్.. గత ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ తీసుకుని మాతృత్వాన్ని ఎంజాయ్ చేసింది.

రీఎంట్రీలో వరుస షాక్‌లే: డెలివరీ అయిన తర్వాత చాలా రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇటీవలే 'కోస్టీ' అనే తమిళ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది ఆమెకు సరైన రీఎంట్రీని మాత్రం అందించలేదు. దీని తర్వాత కాజల్ 'కరుంగాపియమ్' అనే తమిళ చిత్రంతో వచ్చింది. ఇది కూడా ఆమెకు సక్సెస్ ఇవ్వలేదు. దీంతో రెండు షాక్‌లు తగిలినట్లైంది.
భగవంత్, సత్యభామ అని: తల్లైన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇలా ఇప్పటికే ఈ అమ్మడు కమల్ హాసన్‌తో కలిసి 'ఇండియన్ 2', బాలీవుడ్‌లో 'ఉమ', బాలయ్య సరసన 'భగవంత్ కేసరి' అనే సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, 'సత్యభామ' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ కాజల్ అగర్వాల్ భాగం అయింది.

అందులో యమ యాక్టివ్: సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య డెలివరీ అవడంతో చాలా గ్యాప్ తీసుకున్నా.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాకు అస్సలు బ్రేక్ ఇవ్వలేదు. పైగా ఇందులో మరింత యాక్టివ్ అయిన ఈ అమ్మడు.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. తద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది.

అస్సలు తగ్గని హీరోయిన్: కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే వదులుతూ ఉంటోందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తన ఎద అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా గ్లామర్ షోను ఏమాత్రం తగ్గించడం లేదు. దీంతో ఈ బ్యూటీ పేరు ట్రెండ్ అవుతోంది.

కాజల్ బోల్డ్ పిక్స్ వైరల్: కాజల్ అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ భామ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై చీరను ధరించింది. కానీ, విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. అదే సమయంలో మరిన్ని అందాలనూ ఆరబోసింది. ఫలితంగా కాజల్ అగర్వాల్ అందాలు తెగ కవ్విస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది.


Click it and Unblock the Notifications











