Kajal Remuneration భగవంత్ కేసరి మూవీకి కాజల్ రెమ్యునరేషన్.. ఏ రేంజ్ పారితోషికం అంటే?
టాలీవుడ్ చందమామ హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లదు. గత కొన్ని ఏళ్లుగా స్టార్ హీరోల సినిమాల్లో చేస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ భామ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ లోనూ తనదైన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఇక పెళ్లి తర్వాత ఈ భామ... భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో బాలయ్యతో కలిసి కాజల్ ఆగర్వాల్ నటించింది. ఇక ఈ సినిమా కోసం కాజల్ భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....
చందమామ కాజల్ ఆగర్వాల్... టాలీవుడ్ లోకి లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ సినిమా తర్వాత వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇక స్టార్ హీరోల సరసన నటించింది. ఎన్నో మంచి పాత్రలు చేసి.. గుర్తింపును పొందింది. ఇక మగధీర వంటి సినిమాలో నటించి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇక స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఇక ఆ మధ్య ప్రముఖ వ్యాపారవేత్త కిచ్లూని పెళ్లాడింది. ఇక ఇటీవలే ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. ఈ భామకు పెళ్లి తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే అప్పుడు కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో... తను ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఆ సినిమాలో కాజల్ పాత్రనే లేపేశారు మేకర్స్. ఇక ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో నటించిన ఈ భామ... తెలుగులో బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

మొదటి సారిగా బాలయ్య, కాజల్ నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటించింది. శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. తమన్ సంగీతం అంచిందిన ఈ చిత్రానికి షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాతగా వ్యవహారించారు. ఇక ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చేసింది.

మొదటి షో నుంచే ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. ఇక ఈ సినిమాలో కాజల్ రోల్ మొత్తం కలిపి 15 నుంచి 20 నిమిషాల పాత్ర అని తెలుస్తోంది. ఈ మాత్రం నిడివికే కాజల్ బాగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కాజల్ పాత్ర ఈ సినిమాలో అంతగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాదని తెలుస్తోంది. కానీ బాలయ్యతో కాజల్ కామెడీ బాగా ఉందని అంటున్నారు. కాజల్ కామెడీ సినిమాకు హైలెట్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











