Balayya Kajal Aggarwal: పాపం కాజల్... చిరునే అనుకుంటే బాలయ్య కూడా హ్యాండిచ్చాడే?

చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగులో ఎన్నో సినిమాలు చేసి... టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఒక్క తెలుగులోనే కాదు...సౌత్ భాషలతో పాటు.. హిందీలోనూ ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే బాలయ్య కూడా చిరులానే కాజల్ అగర్వాల్ కు హ్యాండిచ్చాడని నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది.. అనే విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చూడగానే చందమామ తేజస్సు... యువకుల కలల రాకూమరి హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తెలుగులో లక్ష్మి కల్యాణం చిత్రంతో పరిచమైన ఈ బ్యూటీ... దశాబ్దం దాటినా నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తేజ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత చందమామ సినిమాలో నటించి మరింత మెప్పించింది.

Heroine Kajal Aggarwals scenes were cut in Balakrishna Anil Ravipudi News Goes Viral

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో ఆమె జాతకమే మారిపోయింది. మిత్రవిందగా ఆమె నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఆ సినిమాతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ... మంచి పేరును సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అయితే ఇటీవల ఈ భామ కిచ్లూ అనే వ్యాపారవేత్తను పెళ్లిచేసుకుని ఓ పిల్లాడికి జన్మను కూడా ఇచ్చింది.

Heroine Kajal Aggarwals scenes were cut in Balakrishna Anil Ravipudi News Goes Viral

ఇక పెళ్లైనా చందమామ కాజల్ అందం అస్సలు తగ్గలేదనే చెప్పాలి. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ.. అందరినీ అలరిస్తుంది. అయితే ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ నటించాల్సి ఉంది. ఆమెపై కొంత భాగం షూటింగ్ కూడా తీశారు మేకర్స్. అయితే ఆ టైంలో ఆమె ప్రెగ్నెన్సీ అవ్వడం... సినిమాల్లో యాక్టింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం రిస్కుతో కూడిన పని. ఇక మేకర్స్ ఆమె పాత్రనే లేపేసారు. ఇక అలా ఆచార్య సినిమాలో కాజల్ మిస్ అయిన సంగతి తెలిసిందే.

Heroine Kajal Aggarwals scenes were cut in Balakrishna Anil Ravipudi News Goes Viral

ఇక చిరు అలా హ్యాండ్ ఇస్తే... ఇప్పుడు బాలయ్య కూడా కాజల్ కు హ్యాండిచ్చాడని తెలుస్తోంది. కాజల్ నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఇక ఈ సినిమలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటివల పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Heroine Kajal Aggarwals scenes were cut in Balakrishna Anil Ravipudi News Goes Viral

అయితే భగవంత్ కేసరి సినిమాలో కాజల్ సీన్స్ ను కట్ చేశారట. సినిమా ఎక్కువ లెంగ్తీ ఉండకుండా ఉండేందుకు కొన్ని సీన్స్ తొలగించాల్సి వచ్చిందట. అలా కాజల్ సీన్స్ ను తీసేశారని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనితో కాజల్ అగర్వాల్ సీన్స్ కొన్ని మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. అప్పుడు కాజల్ కు చిరు హ్యాండ్ ఇస్తే... ఇప్పుడు బాలయ్య హ్యాండ్ ఇచ్చాడని నెట్టింట నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X